Site icon HashtagU Telugu

Watch Video: బాతు బుల్ ఫైట్.. తగ్గేదేలే!

Baatu

Baatu

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన ట్విట్టర్ ను ఫాలో అయ్యే నెటిజన్స్ కూడా కూడా ఎక్కువే. సక్సెస్ స్టరీలు, మోటివేషన్ కథలు, కామెడీతో కూడిన వీడియోలు ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఆయన తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. కొద్దిరోజుల్లో ఈ వీడియో ట్రెండింగ్ లో వచ్చింది. ఇంతకీ ఆ వీడియో ఏముందంటేలో

పెద్ద పెద్ద జంతువుల ముందు చిన్నపాటివి ఇట్టే భయపడిపోతాయి. వాటికి ముందుకు కూడా వెళ్లే ఆలోచన కూడా చేయవు. అలాంటిది ఓ బాతు ఆవు, ఎద్దుల గుంపు ముందుకు వెళ్లింది. అక్కడితో ఆగక వాటితో ఫైట్ కూడా చేసింది. అవి తమ కొమ్ములతో కుమ్మే ప్రయత్నం చేసినా ఏమాత్రం భయపడకుండా పోరాటం చేసింది. దృఢంగా ఉండి తన ఉనికిని చాటుకుంది. ఈ వీడియో ఆనంద్ మహీంద్రాకు నచ్చడంతో సోషల్ మీడియాలో “హౌ ఈజ్ ది జోష్, బర్డ్? హై సర్, అల్ట్రా హై. ఆ పక్షి చట్జ్‌పా నా అంటూ క్యాప్షన్ ఇచ్చారు.