Jelly Fish: అద్భుతమైన వీడియో.. బోటు చుట్టూ చుక్కల్లా జెల్లీ ఫిష్‌లు!

ప్రపంచంలో అనేక అద్బుతాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ప్రజలు నమ్మలేని విధంగా అనేక అద్భుతాలు

  • Written By:
  • Publish Date - August 2, 2022 / 06:30 AM IST

ప్రపంచంలో అనేక అద్బుతాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ప్రజలు నమ్మలేని విధంగా అనేక అద్భుతాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. మన పర్యావరణంలో మనకి తెలియని ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇవి బయటకు వెలుగులోకి వచ్చే వరకు మనకు తెలియవు. ఆశ్చర్యకరమైన, అద్భుతమైన సంఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయి. భూమి మీద కావొచ్చు.. సముద్రం మీద కావొచ్చు.. అద్భుతాలు చాలానే జరుగుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. నెట్టింట్లో ట్రెండింగ్ గా మారుతూ ప్రజలను ఆకర్షిస్తూ ఉంటాయి. అలాంటి ఓ వైరల్ వీడియో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సముద్రంలో ఓ బోటు ప్రయాణిస్తుండగా.. ఆ బోటు చుట్టూ జెల్లీ పిష్ లు చేరుకున్నాయి. వేల సంఖ్యలో జెల్లీ పిష్ లు బోటును చుట్టేశాయి. వెలుగులు చిమ్ముతూ చూడటానికి ప్రకాశంతంగా ఉన్నాయి. సముద్రపు నీళ్లల్లో బోటు చుట్టూ పాల నురగలా తెల్లని చుక్కల్లా కనిపిస్తున్న జెల్లీ పిష్ లను చూస్తే ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ లోని మైఫా బే అనే ప్రాంతంలో కనువిందు చేసిన ఈ అందమైన ఘటనను ఇజ్రాయెల్ కు చెందిన పార్క్స్ అండ్ నేచర్ అథారిటీ విభాగం వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డ్రోన్ కెమెరాతో ఈ అందమైన ఘటనను వీడియో తీసి పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.

ఆ ప్రాంతంలోకి జెల్లీ పిష్ లు ప్రతి ఏటా వలస వస్తుంటాయని, ఈ సారి కూడా అలాగే వచ్చాయని అంటున్నారు. హిందూ మహా సముద్ర ప్రాంతం నుంచి ఇజ్రాయె ల్ సమీపంలోని మధ్యధరా సముద్ర ప్రాంతానికి ప్రతి ఏటా వలస వస్తాయని చెబుతున్నారు. జెల్లీ పిష్ లు అత్యంత విషపూరితమైనవి. వాటికి ఉండే టెంటకిల్స్ చాలా ప్రమాదకరమని, వాటిని తాకితే ప్రాణాల పోయే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. వీటికి మెదడు ఉండదని, వీటి శరీరంలో 95 శాతం నీరే ఉంటుంది. జెల్లీ ఫిష్ లలో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఇవి చేపలు కాదు. విభిన్నమైన జంతువులుగా గుర్తించబడ్డాయి. భూమి మీద పుట్టిన జీవరాశుల్లో మొదట పుట్టినవి ఇవేనని అంటూ ఉంటారు. కాలుష్యం వల్ల జీవ రాశులకు నష్టం జరుగుతుందని, కానీ వీటికి ఎలాంటి నష్టం ఉండదట.