Site icon HashtagU Telugu

Lemon,Petrol Free : స్మార్ట్ ఫోన్ కొంటే .. నిమ్మకాయలు, పెట్రోల్ ఫ్రీ !!

Lemon Petrol Free

Lemon Petrol Free

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఉన్న ఒక మొబైల్ విక్రయ షాపు యజమాని క్రియేటివ్ గా ఆలోచించాడు. రూ.10వేలకుపైగా ధర కలిగిన స్మార్ట్ ఫోన్ కొనే వారికి 1 లీటరు పెట్రోలును ఉచితంగా ఇస్తామని ప్రకటించాడు. మొబైల్ ఫోన్ల యాక్సెసరీస్ కొనే వారికి .. ఆర్డర్ల రేంజ్ ను బట్టి 2 నుంచి 4 నిమ్మకాయలను ఫ్రీగా ఇస్తామని చెప్పాడు. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ను తయారు చేయించి షాపు ముందు అతికించాడు. దీన్ని చూసి.. ఆ మొబైల్స్ షాప్ కు గిరాకీ పెరిగింది. స్మార్ట్ ఫోన్ల సేల్స్ కూడా పెరిగాయి. ప్రస్తుతం సామాన్యులకు దడ పుట్టిస్తున్న నిమ్మకాయలు, పెట్రోలును ఫ్రీ గా ఇవ్వడం.. మంచి మార్కెటింగ్ టెక్నిక్ అని పలువురు ప్రశంసిస్తున్నారు. ఆ షాపులో స్మార్ట్ ఫోన్లతో పాటు నిమ్మకాయలు, పెట్రోలును కూడా చక్కగా డిస్ప్లే చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.