Site icon HashtagU Telugu

Viral Video : యాక్సిడెంట్ అయినా.. రిపోర్టింగ్ ఆప‌లేదు..

Journalist Car

Journalist Car

టీవీ ఛాన‌ల్స్‌లో ఉద్యోగ‌మంటేనే క‌త్తిమీద సాములాంటిది. ఇక రిపోర్టింగ్ చేసేవాళ్ల బాధ‌లైతే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎక్క‌డ ఏ స‌మ‌యంలో ఏం జ‌రుగుతుందో ఊహించ‌లేం. అలానే ఓ రిపోర్ట‌ర్‌కు జ‌రిగిన ఘ‌ట‌న ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అమెరికాలోని వ‌ర్జీనియాలో రిపోర్టింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఏకంగా రిపోర్ట‌ర్‌ను కారు గుద్దేసింది. టోరీ యోర్గే అనే రిపోర్ట‌ర్ ఓ వార్త‌పై రిపోర్టింగ్ చేస్తున్నాడు. లైవ్‌లో యాంక‌ర్‌తో మాట్లాడుతుండ‌గానే వేగంగా వ‌చ్చిన కారు ఢీకొట్టింది. ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.దీంతో రిపోర్ట‌ర్‌తో పాటు కెమెరా కూడా కింద‌ప‌డిపోయింది.

దీనిపై నెటిజ‌న్లు త‌మ అభిప్రాయాల‌ను పంచుకుంటున్నారు.

https://twitter.com/skbozphd/status/1484033222715785216

Exit mobile version