Site icon HashtagU Telugu

Wedding Slap: పెళ్లిలో స్టేజ్‌పైనే కాబోయే భ‌ర్త‌ను చెంప‌మీద కొట్టిన భార్య‌

Groom Hit

Groom Hit

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హ‌మీర్‌పూర్‌లోని ఓ వివాహ‌వేడుక‌లో పెళ్లికొడుకుకి త‌న కాబోయే భార్య అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. వివాహానికి వ‌రుడు వ‌ధువు సిద్ధ‌మ‌వ్వ‌గా అదే స‌మ‌యంలో వ‌రుడు పూలదండ‌ను త‌న కాబోయే భార్య మెడ‌లో వేయ‌డానికి రెఢీ అయ్యాడు. అయితే ఇంత‌లో జ‌ర‌గరానిది జ‌రిగిపోయింది. దండ‌వేసే స‌మ‌యంలో అత‌ని చెంప‌మీద గ‌ట్టిగా కొట్టింది. ఒక్క‌సారి కాదు రెండు సార్లు కొట్ట‌డంతో వ‌రుడు ఖంగుతిన్నాడు. ఆ త‌రువాత వ‌ధువు స్టేజ్‌పై నుంచి వెళ్లిపోయింది. దీంతో ఒక్క‌సారిగా అక్క‌డ ఉన్న వాళ్ళంతా ఆశ్చ‌ర్యానికి గురైయ్యారు. జ‌రిగిన ఘ‌ట‌న‌పై వ‌ధువు బంధువులు జోక్యం చేసుకుని వరుడుకి న‌చ్చజెప్ప‌డంతో ఇరువర్గాల మ‌ధ్య స‌ఖ్య‌త కుదిరింది.

Exit mobile version