Site icon HashtagU Telugu

Maharashtra Results : తెలంగాణలో యుద్ధం ప్రారంభమైంది: బండి సంజయ్‌

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ స్పందించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల యొక్క వైఫల్యం అన్నారు బండి సంజయ్. మహారాష్ట్ర ఫలితాలు ఖచ్చితంగా తెలంగాణ లో ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. తెలంగాణ లో యుద్ధం ప్రారంభం అయ్యిందని బండి సంజయ్‌ తెలిపారు. ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు స్టార్ట్ అవుతాయని బాంబ్‌ పేల్చారు.

కాగా, రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారం చేసిన అన్ని చోట్ల కాంగ్రెస్‌ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రకు రేవంత్ రెడ్డి 10 సార్లు పోయాడు.. అయినా కూడా రేవంత్ రెడ్డి పోయిన సీట్లు అన్ని ఓడిపోయారన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఖర్చు పెట్టిన డబ్బు అంతా తెలంగాణ, కర్ణాటక నుండే పోయాయి.. అయినా వాళ్ళు అక్కడ గెలవ లేదని బండి సంజయ్‌ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులలో ప్రభుత్వం పై అసంతృప్తి ఉందన్నారు. ప్రభుత్వం కూలాలని మేము అనుకోవడం లేదని తెలిపారు. కులగణన వివరాలు పెన్సిల్ తో నింపుతున్నారు.. వాటిని మార్చే అవకాశం ఉందని ఆరోపనలు చేశారు. కులగణనలో భయపెట్టి సర్వే చేస్తున్నారని బండి సంజయ్‌ వివరించారు.

Read Also: Australia: 8 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఆస్ట్రేలియా చెత్త రికార్డు.. ఏంటంటే?