Sonia Gandhi : గురువారం సంవిధాన్ సదన్‌లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ ఎంపీలను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె వక్ఫ్ (సవరణ) బిల్లు- 2025పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం అనేది కేవలం కాగితాలకే పరిమితమైంది. దాన్ని కూడా కూల్చేయాలనేదే వారి ఉద్దేశమని మాకు తెలుసు. మోడీ ప్రభుత్వ వైఫల్యాలను, వారి ఉద్దేశాలను బహిర్గతం చేయాలి. ఏది సరైనది, ఏది న్యాయబద్ధమైనది అనేది ప్రజలకు తెలియజేసేందుకు అందరం కలిసి మన పోరాటాన్ని కొనసాగించాలి అని సోనియా పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగంపై దాడి చేయడమే. దిగువ సభలో ఈ బిల్లును తొక్కేశారు. మోడీ ప్రభుత్వం విద్య, పౌర హక్కులు, స్వేచ్ఛ, సమాఖ్య నిర్మాణం, ఎన్నికల నిర్వహణ ఏదైనా దేశాన్ని అగాధంలోకి లాగుతోంది. ఈసందర్భంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికే ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపించారు. దీన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు.
Read Also: Yes Bank : కస్టమర్లకు షాక్ ఇచ్చిన YES బ్యాంక్
బీజేపీ సభ్యులు కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలని టార్గెట్ చేశాయన్నారు. వారి వైఫల్యాలను ఎత్తిచూపే విషయంలో పార్టీ ఎంపీలు అంతే దూకుడుగా వ్యవహరించాలని ఈసందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. పార్లమెంటులో ప్రతిపక్షాలను మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదని సోనియా ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులు తమ సమస్యలను లేవనెత్తనివ్వకుండా సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పార్టీ ఎంపీలందరూ హాజరయ్యారు.
కాగా, వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. ఇక, రాజ్యసభలో ఈ బిల్లు ఇప్పుడు కీలకమైన పరీక్షను ఎదుర్కొంటోంది.ఇక్కడ ప్రస్తుత సభ్యుల మొత్తం బలం 236. బిల్లును ఆమోదించడానికి అధికార NDAకి 119 ఓట్లు అవసరం. స్వతంత్ర ,నామినేటెడ్ సభ్యుల మద్దతుతో, దాని సంఖ్య 125కి చేరుకుంటుంది. ప్రతిపక్షం వద్ద 95 ఓట్లు ఉండగా16 మంది సభ్యులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
Read Also: Kurnool Airport : కర్నూలు ఎయిర్ పోర్టుకు మహర్దశ