Ghibli Images: సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న గిబ్లీ స్టైల్ ఫోటోలు కావాలా? ఈ సులువైన స్టెప్స్ వాడి సులభంగా పొందండి

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న గిబ్లీ స్టైల్ ఫోటోలు. ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండానే, గిబ్లీ స్టైల్ ఫోటోలు పొందడం చాలా సులభం. సులువైన స్టెప్స్‌ను అనుసరించి, మీరు కూడా మీ గిబ్లీ స్టైల్ ఫోటోలను సులభంగా పొందవచ్చు.

Published By: HashtagU Telugu Desk
Ghibli Style

Ghibli Style

Ghibli Images: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో గిబ్లీ స్టైల్ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ AI టెక్నాలజీ ద్వారా వినియోగదారులు తక్కువ సమయంలో తమ ఫోటోలను యానిమేషన్ రూపంలోకి మార్చుకోవచ్చు. ముఖ్యంగా X (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ చిత్రాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గిబ్లీ స్టైల్ అనేది జపాన్‌కు చెందిన ప్రముఖ యానిమేషన్ స్టూడియో. అయితే, గిబ్లీ స్టైల్ ఫోటోలను ఎలా సృష్టించాలో చాలా మందికి స్పష్టత లేదు. నిజానికి, గిబ్లీ స్టైల్ ఫోటోలను తయారుచేసుకోవడం చాలా సులభం. ఎటువంటి టెక్నికల్ నైపుణ్యం లేకున్నా, కేవలం కొన్ని స్టెప్స్ ఫాలో చేస్తే సరిపోతుంది. మరి, మీ ఫోటోలను గిబ్లీ స్టైల్ ఫోటోలుగా ఎలా మార్చాలో తెలుసుకుందామా?

ఇందుకోసం, మొదటగా చాట్ జీపీటీ (chat.openai.com) వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, మీ అకౌంట్‌లో లాగిన్ అవ్వండి. ఆపై GPT-4 మోడల్‌ను ఎంచుకోండి. అక్కడ “+” (ప్లస్) ఐకాన్ పై క్లిక్ చేసి, మీ ఫోటోను అప్‌లోడ్ చేయండి. మీ ఫోటో అప్‌లోడ్ చేసిన తర్వాత, గిబ్లీ స్టైల్ అప్లై చేయడానికి, “Ghiblify this” లేదా “Turn this image into Studio Ghibli theme” అని రాయండి. ఆ తర్వాత మీ ఫోటోను చాట్ జీపీటీకి అందించండి. ఇక అంతే! కేవలం కొన్ని క్షణాల్లో, AI మీ ఫోటోను అద్భుతమైన గిబ్లీ స్టైల్ చిత్రంగా మార్చి అందిస్తుంది.

ఇలా వచ్చిన ఫోటోలు మీకు నచ్చితే, డౌన్‌లోడ్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నచ్చకపోతే, మీరు కోరుకున్న రంగులు, స్టైల్‌ లో మార్పులు చేయమని మళ్లీ అడగవచ్చు. ఈ విధంగా పూర్తి వివరాలతో మీకు కావలసిన ఫోటోను పొందవచ్చు. ఉచిత వినియోగదారులు రోజుకు 3 ఫోటోలు మార్చవచ్చు, అయితే ప్రీమియం సభ్యత్వం పొందితే, మీరు కావలసినన్ని ఫోటోలను ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవచ్చు. ఇక, ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ ఫోటోలను గిబ్లీ స్టైల్‌లో మార్చి చూసి ఎంజాయ్ చేయండి!

  Last Updated: 01 Apr 2025, 12:15 PM IST