MLC : విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఉపఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

త్వరలోనే కూటమి అభ్యర్థిని ప్రకటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..

Published By: HashtagU Telugu Desk
MLC Election Nominations

MLC Election Nominations

MLC By-Elections: ఉమ్మడి విశాఖ(Visakha) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక కు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయింది. ఈ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రభుత్వ సెలవు రోజుల్లో మినహా మిగతా అన్ని రోజుల్లో నామినేషన్ దాఖలు చేయవచ్చు. నామినేషన్ల స్వీకరణ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండనుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఎన్నికల్లో విశాఖ జిల్లాతో పాటు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ సభ్యులు ఓటర్లుగా ఉంటారు. ఆగస్టు 06 నోటిఫికేషన్ విడుదల కాగా.. నామినేష్ల స్వీకరణ 13 వరకు కొనసాగుతుంది. 14వ తేదీన స్క్రూట్నీ ఉంటుంది. 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదేరోజు తుది అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్సు పద్దతిలోనే వినియోగిస్తామని తెలిపారు. ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 03న ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో మొత్తం ఓటర్లు 838 మంది ఉన్నారు.

కాగా, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న చెన్నుబోయిన వంశీకృష్ణ వైసీపీని వీడి, ఇటీవల పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. వంశీకృష్ణ పై వైసీపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, మండలి చైర్మన్‌ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో విశాఖ స్థానక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. సీపీ అభ్యర్థిగా ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును జగన్ ప్రకటించారు. కూటమి అభ్యర్థి ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలతో చర్చించి దీనిపై ప్రకటన చేసే అవకాశాలున్నాయి.

Read Also: Kavitha : ఢీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

 

 

  Last Updated: 06 Aug 2024, 03:43 PM IST