Site icon HashtagU Telugu

Visa: వీసా వెరీ ఈజీ.. జాప్యాన్ని తగ్గించిన అమెరికా!

UK Visa

Uae Visa Imresizer

వివిధ ఉన్నత చదువులు, విదేవీ విద్యను అభ్యసించేందుకు ప్రతి సంవత్సరం భారతీయ విద్యార్థుల (India Students)తో పాటు పౌరులు సైతం యూఎస్ లాంటి దేశాలకు వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే చాలామంది విదేశాలకు వెళ్లాలన్నా వీసా (Visa) సమస్యలు అడ్డుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా భారతీయులకు మేలు చేసేలా వీసా జాప్యాన్ని తగ్గించింది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఇప్పటివరకు భారతీయులకు 36 శాతం ఎక్కువ వీసాలు (Visa) జారీ చేసినట్లు అమెరికా తెలిపింది. వెయిటింగ్ టైం తగ్గింపుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇప్పటికే వెయిటింగ్ లో ఉన్నవారికి ఇంటర్వ్యూ మినహాయింపులను ఇచ్చింది. భారతీయ మిషన్‌లలో కాన్సులర్ కార్యకలాపాలలో మొదటిసారి విజిటర్స్ కు నిరీక్షణ సమయం 1,000 రోజుల నుండి దాదాపు 580కి తగ్గించబడింది. మిషన్ సిబ్బంది రోజంతా వీసాలను ప్రాసెస్ చేస్తారు. ఈ విషయమై స్టేట్ డిపార్ట్‌మెంట్ కాన్సులర్ ఆపరేషన్స్‌లోని సీనియర్ అధికారి జూలీ స్టఫ్ట్ మాట్లాడుతూ “ప్రజలు (భారతదేశంలో ఎవరైనా) వీసా అపాయింట్‌మెంట్ కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చు. వీసా (Visa) లు త్వరగా జారీ చేసేందుకు కట్టుబడి ఉన్నాం. “మేం ఈ ఏడాది భారతదేశానికి 36 శాతం ఎక్కువ వీసాలు జారీ చేశాం. మరిన్ని వీసాలు ప్రాసెస్ చేయబడ్డాయి. వీసాలు జారీ చేసే సంఖ్య పెరగవచ్చును’’ అని అన్నారు.

అయితే కరోనా  (Covid19) పరిస్థితులు తర్వాత భారతీయ పౌరులు, విద్యార్థులు వీసాలను పొందడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని సవాల్ గా తీసుకున్న ఇండియా ద్వైపాక్షిక సంబంధాలలో ముఖ్యమైన సమస్యగా భావించి, ఇరు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రుల మధ్య చివరి 2+2 సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ లేవనెత్తాడు. విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఈ సమస్యను పరిష్కరించడానికి US వద్ద ఒక ప్రణాళిక ఉందని హామీ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 కంటే ఎక్కువ US మిషన్లు భారతీయ దరఖాస్తులను ప్రాసెస్ చేశాయి.

Also Read: Manish Sisodia: సిసోడియోకు బిగ్ షాక్.. మరో కేసులో విచారణకు!