Site icon HashtagU Telugu

Virat Kohli@Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ లో కోహ్లీకి కోట్ల వర్షం.. ఒక్క పోస్టుకు రూ.8 కోట్లు!!

Virat

Virat

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి ప్రస్తుతం ఫామ్ లో లేకపోయినా.. సోషల్‌ మీడియాలో మాత్రం దుమ్ము లేపుతున్నాడు. కాసుల పంట పండిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న వారి జాబితాలో ఆసియా ఖండం నుంచి కోహ్లి తొలి స్థానంలో నిలిచాడు.తాజాగా  హోపర్క్‌ డాట్‌కామ్‌ (hopperhq.com) నిర్వహించిన సర్వేలో ఈవిషయం వెల్లడైంది. కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ఒక్క పోస్టుకు సంపాదిస్తున్న మొత్తం 10 లక్షల డాలర్లు. ఇది
మన భారత కరెన్సీలో దాదాపు రూ. 8 కోట్ల 69 లక్షలు. కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్ లో 20 కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన పెట్టే
ఒక్క పోస్టు వాళ్లందరికీ చేరాల్సిందే. వాళ్ల నుంచి ఇతరులకు షేర్ అవుతుంది. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి కోహ్లికి కోట్లు వస్తున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్ లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్నవారి జాబితాలో కోహ్లీ 14వ స్థానంలో ఉన్నాడు. అదీగాక ఈ జాబితాలో టాప్-25లో ఉన్న సెలబ్రిటీలలో ఆసియా ఖండం నుంచి కోహ్లీ ఒక్కరే ఉండటం విశేషం. బీసీసీఐ కాంట్రాక్ట్, ఐపీఎల్, ఎండార్స్‌మెంట్స్ ద్వారానే గాక సోషల్ మీడియా ద్వారా కూడా కోట్లల్లో సంపాదిస్తున్నాడు.ఫామ్ లో లేక తంటాలు పడుతున్న కోహ్లిని రెస్ట్‌ పేరుతో బీసీసీఐ విండీస్‌ టూర్‌కు పక్కనబెట్టింది. కోహ్లి 71వ శతకం కోసం అభిమానులు దాదాపు నాలుగేళ్లుగా కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తూనే ఉన్నారు.

రొనాల్డో ఒక్క పోస్టుకు రూ.19 కోట్లు

ఈ జాబితాలో ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో 44 కోట్ల ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.  రొనాల్డో పెట్టే ఒక్క పోస్టుకు రూ.19 కోట్లు( 23.9 లక్షల డాలర్ల) ఆదాయం వస్తోంది.
అంటే కోహ్లీ కంటే రెండింతలు రొనాల్డో సంపాదిస్తున్నారు.  మరో ఫుట్‌బాల్‌ స్టార్ లియోనల్ మెస్సీ కూడా ఒక్క పోస్టు ద్వారా రూ.15 కోట్లు ( 17 లక్షల డాలర్లు) సంపాదిస్తున్నారు.