Site icon HashtagU Telugu

Virat Kohli Dance:’ ఊ అంటావా కోహ్లీ.. ఉఊ అంటావా కోహ్లీ’ .. విరాట్ డ్యాన్స్ వీడియో వైరల్!!

virat dance

virat dance

” ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావ.. ” పాటే జబర్దస్త్!! దానికి క్రికెట్ హీరో విరాట్ కోహ్లీ స్టెప్పులు వేస్తే డబుల్దస్త్ !! ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏ సందర్భంలో కోహ్లీ ఈ డ్యాన్స్ చేశారో తెలుసా ? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ కు ఇటీవల భారత సంతతికి చెందిన వినీ రామన్ తో భారత్ లో సంప్రదాయబద్ధంగా
పెళ్లి జరిగింది. అనంతరం ఆస్ట్రేలియాలో మరోసారి ఉంగరాలు మార్చుకున్నారు.

 


పెళ్లిని పురస్కరించుకొని .. గ్లెన్ మాక్స్ వెల్ దంపతులు బుధవారం రాత్రి బెంగళూరు ఆటగాళ్లకు ప్రత్యేక పార్టీ ఇచ్చారు. దీనికి డుప్లెసిస్, కోహ్లీ దంపతులతో పాటు ఇతర ఆటగాళ్లు కుటుంబసభ్యులతో సహా హాజరయ్యారు. ఈసందర్భంగా సమంత, అల్లు అర్జున్ కు చెందిన సాంగ్ కు కోహ్లీ చిందులేశాడు. ఆ ఫోటోలు, వీడియోలను అనుష్క తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.