Fact Check : స్మార్ట్‌ వాచ్‌తో ఫాస్టాగ్ నుంచి డబ్బు దొంగిలించడం నిజమా?అబద్ధమా?

ఫాస్ట్ ట్యాగ్ స్కామ్ జరుగుతోందంటూ వదంతుల వీడియోలు వైరల్ అవుతున్నాయి.

  • Written By:
  • Updated On - June 28, 2022 / 12:13 PM IST

ఫాస్ట్ ట్యాగ్ స్కామ్ జరుగుతోందంటూ వదంతుల వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఎంతోమంది ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. కొంతమంది కార్ల అద్దాలు తుడుస్తామంటూ వచ్చి ..తమ చేతికి ఉండే స్మార్ట్ వాచ్‌ లాంటి పరికరాల సహాయంతో కార్లపై ఉండే ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్లను స్కానింగ్ చేస్తున్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి. వాళ్ళు స్కానింగ్ చేసిన వెంటనే .. పేటీఎం ఖాతాల్లో ఉండే డబ్బు కట్ అయిపోతోందనేది
ఆ వైరల్ వీడియోల సారాంశం.

Video : https://www.youtube.com/shorts/N8bUIu9Tj7o

అనుమతించిన ఖాతాల ద్వారానే..

వాస్తవానికి ఫాస్ట్‌ట్యాగ్‌ని ఏ వ్యక్తీ కూడా స్కాన్ చేయలేరు. ప్రభుత్వం అనుమతించిన ఖాతాల ద్వారా మాత్రమే ఫాస్ట్‌ట్యాగ్ నుంచి డబ్బు డిడక్ట్ అవుతుంది. ఫాస్ట్‌ట్యాగ్ గురించి తప్పుడు సమాచారం ఇస్తున్న వీడియోలన్నీ ఫేక్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో( పీఐబీ) వెల్లడించింది. ఫ్యాక్ట్ చెక్ వీడియోను కూడా విడుదల చేసింది. ప్రతి టోల్ ప్లాజాకు ప్రత్యేకమైన కోడ్ ఉంటుందని, వీడియోలో క్లెయిమ్ చేసినట్లుగా లావాదేవీ సాధ్యం కానే కాదని వివరణ ఇచ్చింది. NETC మార్గదర్శకాల ప్రకారం.. ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా అలాంటి లావాదేవీలేమీ చేయలేమని Paytm తెలిపింది. ఆథరైజ్డ్ వ్యాపారులు మాత్రమే దీన్ని చేయగలరని వెల్లడించింది.