Swiggy Boy Identified: ఆ స్విగ్గీ బాయ్ అడ్రస్ దొరికింది.. అసలు నిజం తెలిసింది!

సాధారణంగా ఫుడ్ డెలివరీ ఎలా చేస్తాం? టు వీలర్ (స్కూటీ, లేదా బైక్) పైనే కదా చేస్తాం అని సమాధానమిస్తారు చాలామంది.

  • Written By:
  • Updated On - July 11, 2022 / 12:32 PM IST

సాధారణంగా ఫుడ్ డెలివరీ ఎలా చేస్తాం? టు వీలర్ (స్కూటీ, లేదా బైక్) పైనే కదా చేస్తాం అని సమాధానమిస్తారు చాలామంది. కానీ ఓ ఫుడ్ డెలివరీ బాయ్ మాత్రం ఏకంగా గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసి ఒక్కసారిగా హీరోగా మారాడు. అయితే ముంబై లో వర్షాల కారణంగా డెలివరీ గుర్రంపై ఫుడ్ ను డెలివరీ చేయాల్సి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే స్విగ్గీ కంపెనీ కూడా ఆ డెలివరీ ఎవరు? ఎక్కడ ఉంటాడు? అనే వివరాల కోసం వెతికింది. అడ్రస్ చెబితే నగదు బహుమతి ఇస్తానని కూడా ప్రకటించింది.

ఆ వ్యక్తిని గుర్తించగలిగిన వారికి 5000 రూపాయల రివార్డ్ మనీ అందజేస్తామని స్విగ్గీ ఆఫర్ చేసింది. అయితే ఎట్టకేలకు “డెలివరీ ఎగ్జిక్యూటివ్”ను తాము గుర్తించగలిగామని స్విగ్గీ ప్రకటించింది. “అతను 17 ఏళ్ల సుశాంత్. అతను Swiggy డెలివరీ ఎగ్జిక్యూటివ్ కాదట. వేరే కంపెనీకి చెందిన బాయ్ అని తేలింది. వస్తువులను అప్పుగా తీసుకుని వాటిని తిరిగి ఇస్తాడట. ఈ సందర్భంలో, స్విగ్గీ డెలివరీ బ్యాగ్ కూడా అప్పుగా తీసుకున్నాడట. స్విగ్గీ బ్యాగ్‌లో వాస్తవానికి పెళ్లిల్లకు గుర్రాలను అలంకరించడానికి సామాగ్రి (ఎంబ్రాయిడరీ డ్రేప్స్, యాక్సెసరీలు) తీసుకెళ్తున్నాడట. విషయం తెలియక చాలామంది ఫొటోలు, వీడియోలను సోసల్ మీడియాలో పెట్టడం వైరల్ గా మారింది.