Viral Video : వేగంగా దూసుకొస్తున్న రైలు… అంగుళం దూరంలో బాలుడు…వైరల్ వీడియో.!!

ఇంటర్నెట్ లో రైలు పట్టాలపై తృటిలో తప్పిన ప్రమాదాల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.

Published By: HashtagU Telugu Desk
Train Boy Video Copy

Train Boy Video Copy

ఇంటర్నెట్ లో రైలు పట్టాలపై తృటిలో తప్పిన ప్రమాదాల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది. ఇద్దరు చిన్నారులు రైలు పట్టాలపై పరుగులు తీస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రైలు పట్టాలపై పరుగులు పెడుతున్న ఇద్దరు చిన్నారనులు తృటిలో తప్పించుకున్నారు. టొరంటోలో చోటు చేసుకునున్న ఈ షాకింగ్ వీడియోను మెట్రోలింక్స్ అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా దీన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కెనడియన్ రవాణా సంస్థ అయిన మెట్రోలింక్స్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఇద్దరు గుర్తుతెలియని పిల్లలు వేగంగా దూసుకుంటూ వస్తున్న రైలు ఇంజన్ పట్టాల వెంబడి పరిగెత్తుతున్నారు. అయితే ట్రైన్‌ సమీపానికి దగ్గరకు వచ్చే కొద్ది ఆ చిన్నారి తృటిలో ప్రమాదం తప్పించుకొని బయటపడ్డాడు.

వీడియోలో లేత నీలిరంగు చొక్కా, షార్ట్ ధరించి నడుస్తున్న పిల్లలలో ఒకరు రెండు రైలు పట్టాల మధ్య నడుస్తున్నట్లు రికార్డ్ చేయబడింది. రైలు లోపల నుండి వీడియో చిత్రీకరించారు. రైలు బాలుడిని సమీపించడం ఇందులో చూడవచ్చు, కానీ అతను రెండు ట్రాక్‌ల మధ్య నడుస్తున్నాడు, కాబట్టి అతను సురక్షితంగా ఉన్నాడు.

 

తెల్లటి టీ-షర్ట్ మరియు షార్ట్ ధరించి నడుస్తున్న మరో పిల్లవాడు మొదట్లో తన స్నేహితుడితో కలిసి నడుస్తున్నట్లు చూడవచ్చు, కానీ తర్వాత ట్రాక్‌ పైకి వచ్చి త్వరగా దాటాలని నిర్ణయించుకున్నాడు. రైలు ఢీకొనేందుకు చిన్నారి ఒక్క అంగుళం దూరంలో ఉంది అనగా, బయట పడ్డాడు.

ఈ వీడియో ట్విట్టర్‌లో 20,000 మందికి పైగా వ్యూస్ సాధించింది. ఈ పోస్టుకు సంబంధించిన కామెంట్స్ లో చాలా మంది. ప్రజలు ట్రాక్‌లపై నడవకుండా నిరోధించడానికి గార్డులను పట్టాల వద్ద నియమించాలని సూచించారు. అయితే ఈ పిల్లలపై ఎలాంటి చర్యను తీసుకున్నారో పేర్కొనలేదు.

  Last Updated: 03 Jun 2022, 11:27 PM IST