Viral Video : ఒక్క క్ష‌ణంలో ఆమెను కాపాడాడు.. లేక‌పోతే రైలు కింద ప‌డి..

కదులుతున్న రైలు నుంచి బాలికను ఓ వ్యక్తి రక్షించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది

Published By: HashtagU Telugu Desk
Train Viral Video

Train Viral Video

కదులుతున్న రైలు నుంచి బాలికను ఓ వ్యక్తి రక్షించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘ‌ట‌న‌ని మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని బర్ఖేడీ ప్రాంతానికి చెందిన స్థానికులు దీనిని చిత్రీక‌రించారు. ఆగి ఉన్న గూడ్స్ రైలు వ‌ద్ద ఓ బాలిక వెళుతుండగా ఒక్కసారిగా రైలు కదలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు కింద చిక్కుకున్న బాలిక కేకలు వేయడం ప్రారంభించింది. ఆమె కేకలు విన్న పక్కనే ఉన్న మెహబూబ్ అనే వ్య‌క్తి బాలికను రక్షించేందుకు కదులుతున్న రైలు మధ్యలోకి వెళ్లి పట్టుకుని ఆ బాలికను ర‌క్షించాడు.ఈ ఘ‌ట‌న ఫిబ్రవరి 5వ తేదీన జరిగిన‌ట్లు తెలుస్తోంది. బాలికను రక్షించిన మెహబూబ్ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు.

 

  Last Updated: 12 Feb 2022, 12:35 PM IST