Site icon HashtagU Telugu

Dog Vs Tiger: పులిపై దాడిచేసిన శునకం.. చక్కర్లు కొడుతున్న వీడియో!

Dog And Tiger

Dog And Tiger

ఓ కుక్క ఇతర కుక్కలతో స్ట్రీట్ ఫైట్ చేయడం చాలామంది చాలాసార్లు చూసే ఉంటారు. పిల్లి, నెమలి, కుందెలు లాంటివి వాటిని వెటాడటం చూసి ఉండొచ్చు. కానీ కుక్క పెద్ద పులిపై దాడి చేయడం చూశారా..? కుక్క ఏంటీ పులిపై దాడిచేయడం ఏంటీ? అని అనుకుంటున్నారా.. అవును ఓ పులి కుక్క కాటుకు గురైంది.  కుక్క, పులి మధ్య జరిగిన భారీ ఫైట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రెండు రోజుల క్రితం యానిమల్స్ పవర్ అనే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. గోల్డెన్ రిట్రీవర్ అనే కుక్క పులి చెవిని కొరికేందుకు ప్రయత్నిస్తున్నట్లు చూడొచ్చు. అంతేకాదు.. పులితో ఫైట్ కూడా చేస్తోంది. ప్రాణాంతకమైన పులితో కుక్క ఫైట్ చేయడం నెటిజన్స్ ను ఆశ్చర్యపర్చింది. అక్కడే ఉన్న సింహం ఆ పోరాటాన్ని విడదీయాలని చూస్తోంది, కానీ అది ఫైట్ చేయడానికి ఇష్టపడలేదు. పులి కుక్కపై పంజా వేస్తుండగా, ఆ కుక్క పులి ముఖం, చెవిపై కరిచింది. ఈ వీడియో 4.6 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. 18,000 లైక్స్ వచ్చాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్స్ ‘‘వామ్మో ఇదేం కుక్కరా బాబోయ్’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version