Fire Stunt Video: ఫైర్ స్టంట్స్ చేస్తున్నారా.. ఈ వీడియోను చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఫైర్ స్టంట్‌లు చాలా ప్రమాదకరమైనవి. సురక్షితమైన పద్ధతిలో జాగ్రత్తగా నిర్వహించకపోతే ప్రాణాలు కూడా పోవచ్చు.

  • Written By:
  • Updated On - October 31, 2022 / 03:59 PM IST

ఫైర్ స్టంట్‌లు చాలా ప్రమాదకరమైనవి. సురక్షితమైన పద్ధతిలో జాగ్రత్తగా నిర్వహించకపోతే ప్రాణాలు కూడా పోవచ్చు. ఒక ఫైర్ స్టంట్ భయంకరమైన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 12 మిలియన్లకు వ్యూస్ వచ్చాయి.  ఓ ఈ వెంట్ లో ఒక వ్యక్తి పెట్రోలు బాటిల్, మంటల కర్రతో ప్రమాదకరమైన విన్యాసం చేస్తూ కనిపించాడు. ప్రేక్షకుల ముందు టేబుల్‌పై నిలబడి ఉండగా, ఆ వ్యక్తి నోటిలో పెట్రోలు పోసాడు. దానిని మంట (నిప్పు) ఉమ్మివేసినప్పుడు అగ్నిరవ్వలు అతన్ని సమీపించాయి.

నోటికి, గడ్డానికి నిప్పంటుకోవడంతో ముఖమంతా కాలిపోయింది. ఇద్దరు స్నేహితులు మంటలను ఆర్పివేయడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భయాందోళనకు గురవుతున్నారు, అయితే ప్రజలు అలాంటి విన్యాసాలకు ప్రయత్నించవద్దని చెప్పారు. “బహుత్ హాయ్ ఖతర్నాక్ స్టంట్ హై హర్ కిసీ కో యహ్ నహిం కర్నా చాహీ” అని నెటిజన్స్ కామెంట్ చేశారు.