Site icon HashtagU Telugu

Kurta Pyjama: బీహార్ లో దారుణం.. కుర్తా పైజామా ధరించిన ప్రధానోపాధ్యాయుడు జీతం కట్?

Bihar

Bihar

తాజాగా బీహార్ లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు జీతాన్ని కట్ చేశారు. అయితే అందుకు గల కారణాన్ని తెలిసిన పలువురు నెటిజెన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని ఒక జిల్లా మెజిస్ట్రేట్ కుర్తా పైజామా ధరించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుని తిట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సంఘటన తాజాగా చోటు చేసుకుంది. బీహార్ లోని ప్రాథమిక పాఠశాల బాల్ గూడర్ లో జిల్లాకు చెందిన మెజిస్ట్రేట్ ఆకస్మిక తనిఖీని నిర్వహించారు.

ఈ నేపథ్యంలోనే నిర్భయ్ కుమార్ సింగ్ అనే ప్రధానోపాధ్యాయుడు కుర్తా పైజామా ధరించినందుకు బీహార్ లోని లకిస రాయ్ జిల్లాకు చెందిన డిఎం సంజయ్ కుమార్ సింగ్ ఉపాధ్యాయుని మందలించాడు. కుర్తా పైజామా ధరించి తాను ఒక టీచర్ గా కాకుండా రాజకీయ నాయకుల కనిపిస్తున్నాడు అంటూ ఆ ప్రధానాపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా కుర్తా పైజామా ధరించినందుకు ఆ ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్ నోటీస్ జారీ చేస్తూ జీతం కట్ చేయాలి అంటూ కఠినమైన ఆదేశాలను జారీ చేశారు డిఎం.

 

ఇక అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో డిఎం మాట్లాడుతూ నువ్వు ఒక టీచర్ లా కనిపిస్తున్నావా? మొదటి మిమ్మల్ని చూసి స్థానికంగా ఎవరు ప్రజాప్రతినిధులా కనిపిస్తున్నారని నేను అనుకున్నాను అంటూ సదరు ఉపాధ్యాయుడిని మందలించారు డిఎం. కుర్తా పైజామా వేషంలో నిన్ను గురువుగా మేము అంగీకరించలేము. ఒకవేళ మీరు ప్రజా ప్రతినిధిగా చూస్తూ ప్రవర్తిస్తే వెళ్లి ఓట్లు అడగండి మేము సున్నితత్వాన్ని అనుమతించలేము అంటూ సదరు ఉపాధ్యాయుడు పై మండిపడ్డారు డిఎం.

Exit mobile version