Site icon HashtagU Telugu

Gandhi burned: దేశమా సిగ్గుపడు.. గాంధీని కాల్చి, గాడ్సే కు జైకొట్టి!

Gandhi

Gandhi

మహాత్మాగాంధీ.. మన జాతిపిత (Mahatma Gandhi). జాతియావత్తు ఆయనకు రుణపడి ఉండాలి. అలాంటి గాంధీని కూడా కొందరు విద్వేశంతో అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక బాధాకరమైన చర్యలో ఆర్ఎస్ఎస్ అనుకూల మద్దతుదారులు గాంధీ (Mahatma Gandhi)ని చంపిన నాథూరామ్ గాడ్సేను కీర్తిస్తూ.. మహాత్మాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సంఘటన సోమవారం గాంధీ వర్ధంతి సందర్భంగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమై ఇంటర్నెట్లో వైరల్ (Viral) అవుతోంది. గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసిన ఈ వీడియో అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

కాషాయ దుస్తులు ధరించిన వ్యక్తులు గాడ్సే (Godse) ను కీర్తిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. వారు దిష్టిబొమ్మకు గాంధీ చిత్రం ఫ్లెక్సీని కట్టారు. గాడ్సేకు అనుకూలంగా నినాదాలు చేసిన తర్వాత.. గాంధీ (Mahatma Gandhi) దిష్టిబొమ్మను వారు దహనం చేశారు. ఆర్ఎస్ఎస్ అనుకూల మద్దతుదారులు గాడ్సేకు మద్దతుగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఇది నిజంగా అసహ్యకరమైన సంఘటనగా చెప్పొచ్చు. దీనిని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకోలేదు.

Also Read: AAP And BRS: రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన ‘ఆప్, బీఆర్‌ఎస్‌’