Site icon HashtagU Telugu

Viral Video: మద్యం మత్తులో రెచ్చిపోయిన మందుబాబు.. కొండచిలువను మెడలో వేసుకుని స్టంట్స్..!

Viral Video

Compressjpeg.online 1280x720 Image 11zon

Viral Video: మద్యం మత్తులో మందుబాబులు చేసే పనులకు చూపరులు నివ్వెరపోతుంటారు. పాము చుట్టూ తిరగాలంటేనే జనం భయపడుతుండగా, ఓ మందుబాబు దానిని మెడలో వేసుకుని ఆడుకోవడం ప్రారంభించాడు. తాజాగా ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ (Viral Video) చేసింది. ఈ వీడియోలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన మెడలో కొండచిలువతో తిరుగుతూ ప్రజలను ఫోటోలు తీయమని అడిగాడు. దీని తర్వాత ఏం జరుగుతుందో అని అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో బయటికి రావడంతో జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు.

మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కొండచిలువ దగ్గరికి వెళ్లి మెడకు చుట్టుకోవడం వీడియోలో కనిపిస్తోంది. దీని తరువాత అతను తన ఫోటో తీయమని సమీపంలో ఉన్న వ్యక్తులను అడుగుతున్నాడు. కానీ క్రమంగా కొండచిలువ మెడపై పట్టు బిగించింది. దీని తర్వాత ఆ వ్యక్తి రోడ్డున పడతాడు. కానీ అక్కడ ఉన్న వ్యక్తి అతని ప్రాణాలను కాపాడాడు. ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

Also Read: Amala Paul : రెండో పెళ్లి చేసుకోబోతున్న అమలాపాల్.. బర్త్‌డే రోజు రొమాంటిక్ ఫోటోలు షేర్ చేసిన కాబోయే వరుడు..

ప్రజల రియాక్షన్

వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు. ఏదైనా జంతువును ఆటపట్టిస్తే, అది కూడా కోపంగా మారుతుందని రాశాడు. మరో వినియోగదారు.. ఈరోజు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు అని రాయగా.. ‘మద్యం తాగి ప్రజలు ఏదైనా చేస్తారు’ అని మరో వినియోగదారుడు రాసుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

We’re now on WhatsApp. Click to Join.