Site icon HashtagU Telugu

Viral : డెత్ సర్టిఫికేట్ పోయిందంటూ ప్రకటన…ఫన్నీగా స్పందిస్తున్న నెటిజన్లు…వైరల్!!

Assam

Assam

సోషల్ మీడియా అంటేనే వైరల్..విచిత్రమైన పోస్టులు కనిపిస్తే…నెటిజన్లు ఊరుకుంటారా.? సోషల్ మీడియాలో నిత్యం మనం ఎన్నో వీడియోలు, ఫోటోలు చూస్తుంటాం. అందులో ఆశ్చర్యానికి గురిచేసేవి కొన్ని ఉంటే..ఆలోచింపచేసేవి మరికొన్ని ఉంటాయి. ఇంకొన్ని కడుపుబ్బా నవ్వుకునేలా చేస్తాయి. ఇలా ఓ వ్యక్తి ఇచ్చిన ప్రకటన ఇప్పుడు…నెటిజిన్లను నవ్వుకునేలా చేసింది. ఈ ప్రకటన వివరాలను IPSఅధికారి రుపిన్ శర్మన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. అంతేకాదు This happens only in india అంటూ క్యాప్షన్ కూడా జత చేశారు.

ఇంతకూ ఆ పోస్టులో ఏం ఉందనే కదా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. ఓ వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ పోయిదంటూ ఓ పత్రికలో యాడ్ ఇచ్చాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న అస్సాంలో లందింగ్ బజార్ దగ్గర ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నాడు. ఈ యాడ్ లో రిజిస్ట్రేషన్ నెంబర్, వరస సంఖ్య కూడా ఉన్నాయి. ఆ వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ స్వర్గం నుంచి ఇవ్వాలని అడుగుతున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరో నెటిజన్ తన డెత్ సర్టిఫికెట్ పోగొట్టుకున్నాడు..దొరికినవాళ్లు అతనికి ఇవ్వండంటూ కామెంట్ చేశారు.ఇప్పుడు ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ గా మారింది.

Exit mobile version