Minister Ponguleti Srinivas Reddy : వికారాబాద్ ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..కీలక వ్యాఖ్యలు చేశారు. పింక్ కలర్ ముసుగు వేసుకున్న దోషులను మీడియా ముందు పెడుతామని అన్నారు. అతి కొద్ది గంటలలోనే వికారాబాద్ దోషులను మీడియా ముందు పెడుతామన్నారు. రైతుల ముసుగులో పింక్ కలర్ ముసుగు వేసుకొని కొందరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
రైతుల అనే పేరు ముందు పెట్టి ముసుగు వెనక ఎవరు ఉన్నారో బయటపెడుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటున్న అధికారులను, ప్రభుత్వాన్ని పింక్ కలర్ ముసుగు అడ్డు పెట్టుకొని కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. అధికారులపై దాడి ఘటనలో బీఆర్ఎస్ శక్తులు పనిచేశాయని… నిందితులు ఎంతటి వారైనా సరే పోలీసులు అరెస్ట్ చేసి తీరుతారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన అప్పు కు వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుందని విమర్శలు చేశారు.
కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, రెవెన్యూ అధికారులపై దాడి ఘటనపై బుధవారం మీడియాతో మాట్లాడుతూ..కలెక్టర్‌పై దాడి అమానుషమని, దాడి చేసిన వాళ్లు ఎంతటి వాళ్లైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడిని ప్రోత్సహించిన బీఆర్ఎస్ నాయకులు, ఇందులో ప్రమేయం ఉన్నవారిని వదిలిపెట్టబోమన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేయొచ్చని, కానీ కలెక్టర్‌పై దాడులకు పాల్పడటం సరైన పద్ధతి కాదని సూచించారు. ఇక అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్‌తో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారని, దాడికి పాల్పడిన వారు కేటీఆర్‌తో సైతం ఫోన్ ద్వారా టచ్‌లోనే ఉన్నారని, పోలీసుల దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.
Read Also: KL Rahul: ఐపీఎల్ 2025.. కేఎల్ రాహుల్ వెళ్లేది ఈ జట్టులోకే..!