Site icon HashtagU Telugu

Russian Tanks: ఉక్రెయిన్ దాడిలో రష్యా యుద్ధ ట్యాంకులు ధ్వంసం

Russia

Russia

రష్యా, ఉక్రెయిన్ దేశాల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. యుద్ధం ప్రారంభమై నెలలు గడుస్తున్నా నేటికీ తీవ్ర రూపం దాలుస్తూనే ఉంది. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సర్వం నష్టపోయినా వెనకడగు వేయడం లేదు. తాజాగా తొమ్మిది రష్యన్ ట్యాంకులను తమ వైమానిక దళం చేసిందని ఉక్రెయిన్ తెలిపింది. పేలుళ్ల తర్వాత ట్యాంకుల నుంచి దట్టమైన పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలను తమ రక్షణ మంత్రిత్వ శాఖ షేర్ చేశారు. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ట్వీట్ లో పేలుళ్లకు సంబంధించిన వీడియోలు చూడొచ్చు.

“ఈ యుద్ధంలో ఉక్రేనియన్ వైమానిక దళాలు తొమ్మిది రష్యన్ ట్యాంకులను ధ్వంసం చేశాయి. శత్రువుల ట్యాంకుల సంఖ్య త్వరలో 2,000కు చేరుకుంటుంది’’ మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా సైనికులు మూడు రోజుల్లో కైవ్‌ను స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. కానీ ఉక్రెయిన్ సైనికులు సమర్థవంతంగా రష్యా దాడులను తప్పికొట్టారు. ఫిబ్రవరి 20న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేటికీ కొనసాగుతోంది.