Site icon HashtagU Telugu

Creative Stairs:వావ్.. మడత పెట్టే మెట్లు.. డిజైన్ అద్భుతంగా ఉందిగా?

Stairs Sticking

Stairs Sticking

టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే అన్ని విషయాల్లో టెక్నాలజీకి అనుగుణంగా నడుచుకుంటున్నారు. మరి ముఖ్యంగా అంటే టెక్నాలజీకి అనుగుణంగా ఇళ్ళు, బిల్డింగ్ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. అయితే ఈ టెక్నాలజీకి అనుగుణంగా నిర్మించిన నిర్మాణాలను చూస్తే వావ్ అనాల్సిందే. అటువంటి వాటిని చూస్తే టెక్నాలజీ ఇంత డెవలప్ అయిందా అని అనిపిస్తూ ఉంటుంది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ ఉండడంతో కొత్త కొత్త ఆవిష్కరణలు కొత్త కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.

ఇప్పట్లో ఇంటి నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా వారి టేస్ట్ కు తగ్గట్టుగా నచ్చిన విధంగా అందంగా నిర్మించుకుంటూ ఉంటున్నారు. అయితే ఇదివరకు అక్కడక్కడ మాత్రమే ఇల్లు ఇంద్ర భవనంలో ఉండేవి. కానీ రాను గాని టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని సరికొత్త టెక్నాలజీలతో ఉపయోగించుకుని నిర్మించుకుంటున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది కూడా అలాంటిదే. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. స్టెప్స్ లేదా మెట్లను మడత పెట్టవచ్చట.

 

సాధారణంగా ఇళ్లకు మెట్లు ఉండడం అన్నది సర్వ సాధారణమైన విషయం. అయితే వీటి విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వినూత్నంగా వాటిని నిర్మిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే మెట్లు మాత్రం మడత పెట్టవచ్చట. పల్లెటూర్లలో అయితే ఇల్లు కొంచెం విశాలంగానే ఉంటాయి. కానీ పెద్ద పెద్ద సిటీలలో మాత్రం కొంచెం ఖాళీ స్థలం ఉన్నా కూడా ఐదు ఆరు అంతస్తులు కట్టేస్తూ ఉంటారు. ఆ ఇల్లు ఎలా ఉంటాయి అంటే చూడటానికి అగ్గిపెట్టె లాగా కూడా ఉంటాయి. అయితే అటువంటి వారికి ఇప్పుడు మనం తెలుసుకోబోయే మెట్లు బాగా ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు. మనకు అవసరం లేనప్పుడు వీటిని గోడకు అతుక్కుపోయేలా మడతపెట్టొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆనంద్ మహీంద్రాను తెగ ఆకట్టుకుందట. ఆ వీడియోలో వీడియో మనం పైకి ఎక్కి మెట్లు అవలీలగా మడత పెట్టేస్తున్నాడు.

Exit mobile version