Site icon HashtagU Telugu

Watch Video: స్మార్ట్ మంకీస్.. మొబైల్ తో కాలక్షేపం చేస్తున్న కోతులు!

Monkies

Monkies

కోతులు కూడా మనుషులకు ఏమాత్రం తీసిపోవు. మనుషులు ఏయే పనులు చేస్తారో.. అలాంటి పనులు చేయడానికి ప్రయత్నిస్తాయి కూడా. ఈ వీడియోలోని కోతులు మాత్రం తగ్గేదేలే అంటూ మేం కూడా మొబైల్స్ వాడగలం అంటూ ఫోన్ తో కుస్తీలు పడుతున్నాయి. ఒక వ్యక్తి ఫోన్‌ని పట్టుకుని ఉండగా రెండు కోతులు అందులో నిమగ్నమై ఫోన్ ను చెక్ చేస్తున్నాయి. పక్కన ఉన్న కోతి ఒకటి ఫోన్ కింద పడిపోకుండా గట్టిగా పట్టుకుంది. కోతులు స్క్రీన్ వైపు చూస్తుండగా ఎంజాయ్ చేస్తుండగా, వాటిలో ఒకటి కూడా ఫోన్ పట్టుకుని స్క్రోలింగ్ చేస్తోంది. ఇంతలో మరో చిన్న కోతి నేను కూడా చూస్తానంటో మరో కోతిని లాగుతోంది. గతేడాది తొలిసారి వైరల్‌గా మారిన ఈ వీడియో ట్విటర్‌లో షేర్ చేసిన తర్వాత మళ్లీ వైరల్ గా మారింది. ఎందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి లుక్కేయండి మరి!

Exit mobile version