Wrong Announcement: ఇదేం రిపోర్టింగ్ సామి.. బతికుండగానే ‘పోప్’ ను చంపేశావే!

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మిలియన్ల మంది ప్రజలు వార్తాపత్రికలు, వార్తా ఛానెల్స్, వెబ్‌సైట్‌లపై ఆధారపడతారు.

  • Written By:
  • Updated On - December 28, 2021 / 08:06 PM IST

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మిలియన్ల మంది ప్రజలు వార్తాపత్రికలు, వార్తా ఛానెల్స్, వెబ్‌సైట్‌లపై ఆధారపడతారు. తాజా రాజకీయ పరిణామాలను అర్థంచేసుకోవడానికి, ప్రముఖులకు సంబంధించిన అప్ డేట్స్ గురించి తెలుసుకోవడానికి వార్తా మాధ్యమాలపై ఆధారపడతారు. కానీ ఒక వార్తా సంస్థ పొరపాటున తప్పుడు సమాచారాన్ని ఇస్తే ఏమి జరుగుతుంది? ఆ న్యూస్ కచ్చితంగా వైరల్ అవుతుంది.

రోమన్ క్యాథలిక్ చర్చి అధిపతి పోప్ మరణాన్ని బతికే ఉండగా, చనిపోయారని ITV న్యూస్ ప్రకటించింది. లైవ్ టెలివిజన్ బ్లండర్ క్రిస్మస్ రోజున జరిగింది. జర్నలిస్ట్ కైలీ పెంటెలో అనుకోకుండా పోప్ మరణించినట్లు ప్రకటించారు. అయితే సరిగ్గా అదే సమయంలో వ్యాక్సిన్ గురించి Ms పెంటెలో ప్రత్యక్ష ప్రసారం లో మాట్లాడుతున్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించిన పోప్ ఫ్రాన్సిస్ అన్ని దేశాలలో వ్యాక్సిన్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఇంకా ఎక్కువ మంది టీకాలు వేయించుకోవాలని ఆయన కోరారు. అత్యవసరమైన వారికి టీకాలు అందుబాటులో ఉంచాలని ఆయన చెప్పారు. వెంటనే తేరుకున్న జర్నలిస్టు తప్పును తెలుసుకుని క్షమించాలని వేడుకున్నాడు. అయితే తప్పు సరిదిద్దుకునే లోపే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.