Site icon HashtagU Telugu

Video: విరిగిన భారీ ధ్వజస్తంభం.. తప్పిన ప్రాణప్రాయం!

Viral

Viral

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పడిటివారిపాలెంలో ఒక దేవాలయం వద్ద భారీ ఆలయ స్తంభం విరిగి కిందపడటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తృటిలో తప్పించుకున్నారు. అందుకు సంబంధించిన ఘటన వీడియోలో నిక్షిప్తమైంది. ప్రస్తుతం ఈ వీడియలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్షిణ భారతదేశంలోని హిందూ దేవాలయాల్లో తరచుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఓ ఆలయ దగ్గర ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తుండగా, క్రేన్స్ స్తంభాన్ని వదిలేయడంతో ధ్వజస్తంభం ఫైభాగం కూలీ కిందపడింది. ముప్పును పసిగట్టిన భక్తులు అక్కడ్నుంచి పరుగులు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. పిడుగురాళ్ల పోలీసు అధికారి మాట్లాడుతూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు.

Exit mobile version