Site icon HashtagU Telugu

No Water In Venus, Earth Next: భూమికి కూడా శుక్ర గ్రహం గతే పడుతుందా..నీరు అంతరించిపోతుందా..!!!

Venus planet

Venus planet

ఒకప్పుడు శుక్రుడిపై కూడా భూమి లాగే సముద్రాలు, నదులు ఉండేవట..కానీ ఉన్నట్టుండి అక్కడి పరిస్థితులు మారిపోయి, జీవనదాలు ఎండిపోయి, సముద్రాల్లోంచి నీరు మాయం అయ్యింది. దాంతో జీవజాలం అంతా అంతరించి పోయిందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే భూమి చుట్టు ఉన్నఅయనోస్ఫియర్ లోనూ ఇలాంటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి శుక్రుడిపై జరిగినట్లే భూమిపై జరుగుతుందా అనే ప్రశ్నకు మాత్రం కచ్చితంగా కాదనే సమాధానం చెబుతున్నారు నాసా శాస్త్రవేత్తలు.

శుక్రుడి వాతావరణంలో ఉన్న ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కన్నా భూమిమీద ఉన్న ఎలక్ట్రిక్ పొటెన్షియల్ 25రెట్లు బలహీనంగా ఉంటుందంటున్నారు. భూమి చుట్టుంది కేవలం 0.3 విద్యుత్ శక్తి వోల్టులేనని చెబుతున్నారు. అయితే ఇది ఒక మామూలు బ్యాటరీ కన్నా బలహీనమని అంటున్నారు.

ఈ క్రమంలోనే ఆ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ను లెక్కించేందుకు నాసా ఈనెల 9న ఎండ్యూరెన్స్ అనే ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఆర్కిటిక్ మహాసముద్రంలో ఉన్న నార్వే ద్వీపకల్పం శవల్బార్డ్ నుంచి భూమిపై ఉన్న అయాస్కాంత క్షేత్రం ఉన్న ఉత్తరధ్రువానికి రాకెట్ ను పంపనుంది. భూ వాతావరణం నుంచి తప్పించుకువెళ్లిపోతున్న ఎలక్ట్రాన్ల శక్తిని ఎండ్యూరెన్స్ ద్వారా లెక్కించనున్నారు.

నిజానికి ఎలక్ట్రాన్లు భూవాతావరణం నుంచి నేరుగా బయటకు వెళ్లేవని..కానీ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వల్ల అదిప్పుడు కొంచెం నెమ్మదించిందని దానికిగల అంతర్గత కారణాలను తెలుసుకునేందుకు ఎండ్యూరెన్స్ ప్రయోగం చేపడుతున్నామని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. అనుకున్నట్లు జరిగి మిషన్ విజయవంతం అయితే…ప్రపంచంలో భూమి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ను లెక్కించిన తొలి ప్రయోగం ఇదే కానుంది.