Worlds Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి (Worlds Oldest Man)గా గుర్తింపు పొందిన వెనెజులాకు చెందిన జువాన్ విసెంటె పెరెజ్ మోరా (Juan Vicente Perez Mora) తాజాగా మరణించారు. 114 సంవత్సరాల వయసులో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
Venezuelan Juan Vicente Perez Mora, certified in 2022 by Guinness World Records as the oldest man in the world, died on Tuesday at the age of 114, officials and relatives said.
Details https://t.co/IE0HOoLhdU#VisionUpdates
— The New Vision (@newvisionwire) April 3, 2024
వెనెజులా (Venezuela)కు చెందిన జువాన్.. మే 27, 1909లో ఆండియన్ రాష్ట్రంలోని టాచిరాలో గల ఎల్‌కోబ్రే పట్టణంలో జన్మించాడు. జువాన్ తల్లిదండ్రులకు మొత్తం 10 మంది జన్మించగా.. ఈయన తొమ్మిదో సంతానం. కాగా, 2022లో ఈ భూమ్మీద ప్రపంచంలోనే అత్యంత ఎక్కువకాలం జీవించిన వ్యక్తిగా జువాన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు (Guinness World Records) ఎక్కారు. ఫిబ్రవరి 4, 2022 నాటికి ఆయన వయసు 112 సంవత్సరాల 253 రోజులు. ప్రపంచంలోనే చాలాఏళ్లు జీవించి ఉన్న అతిపెద్ద వ్యక్తిగా ఆయన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ గుర్తించింది. ఈ మేరకు సర్టిపికేట్ కూడా అందించింది.
We’re now on WhatsApp. Click to Join.
అయితే, 114 సంవత్సరాల వయసులో మంగళవారం ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణ వార్తను వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో (Nicolas Maduro) సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ఇక జువాన్‌కు 11 మంది పిల్లలు ఉన్నారు. 2022 నాటికి అతడికి 41 మంది మనుమలు, 30 మంది మునిమనవళ్లు ఉన్నారు.