Site icon HashtagU Telugu

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేత

Vallabhaneni Vamsi bail petition dismissed

Vallabhaneni Vamsi bail petition dismissed

Vallabhaneni Vamsi : వైసీపీ నేత వల్లభనేని వంశీ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను సీఐడీ కోర్టు కొట్టివేసింది. వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లనూ న్యాయస్థానం కొట్టివేసింది. బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ సీఐడీ కోర్టులో గురువారం విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం వంశీ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: Earthquake: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో భూకంపం.. ప‌రుగులు తీసిన జ‌నం!

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేయలేదు. ఈ కేసులో ఆయన ఏ 71గా ఉన్నారు. కేసు నమోదు అయిన తర్వాత ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. అయితే ఆ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ ను బెదిరించి కోర్టులో వాంగ్మూలాలు నమోదు చేయించడం, ఆయనను కిడ్నాప్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో వంశీని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ జైల్లో ఉన్నప్పుడే ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ విచారణ పూర్తయి తీర్పు వచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్ ను హైకోర్టు నిరాకరించింది. దాంతో వేరే కేసులో జైల్లో ఉన్నందున ఆ కేసులో బెయిల్ వస్తే పోలీసులు మళ్లీ ఈ కేసులో అరెస్టు చూపిస్తారన్న ఉద్దేశంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆయనకు నిరాశే ఎదురయింది. ఇప్పటికీ సత్యవర్ధన్ పై కిడ్నాప్ కేసులో ఇంకా బెయిల్ పిటిషన్ వేయాల్సి ఉంది. వంశీకి బెయిల్ రావడం అనేది క్లిష్టమైన వ్యవహారంగా సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు.

Read Also: CM Revanth Reddy : కక్షపూరిత రాజకీయాలు చేస్తే.. ఇప్పటికే కొందరు జైలులో ఉండేవారు: సీఎం రేవంత్‌ రెడ్డి