Mt Vesuvius Incident: సెల్ఫీ తీసుకుందామని అగ్నిపర్వతంలో పడిపోయాడు.. చివరికి అలా?

  • Written By:
  • Publish Date - July 13, 2022 / 07:15 AM IST

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఎన్నో అగ్నిపర్వతాలు ఉన్నాయి. అటువంటి ప్రమాదకరమైన అగ్నిపర్వతాలలో మౌంట్ వెసువియస్ అగ్నిపర్వతం కూడా ఒకటి. ఈ అగ్నిపర్వతం ఇటలీలోని నేపుల్స్ నగరానికి దగ్గరగా ఉంది. అయితే పర్యాటకులకు ఈ అగ్నిపర్వతం ప్రధాన బిలం వద్దకు అనుమతి ఉండదు. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే అటువంటిది అమెరికాకు చెందిన పర్యాటకుల కుటుంబం అక్కడ ఉన్న వ్యక్తులు కళ్ళు కప్పి నిషేధించబడిన ప్రాంతంలోకి ప్రవేశించారు.

అలా ఎవరికంటే పడకుండా అడ్డదారుల్లో వెళుతూ అగ్నిపర్వతం పేలినప్పుడు లావాను వెళ్లగకే ప్రధాన బిలం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఒక యువకుడు ఆ ప్రధాన బిలం అంచున నిలబడి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే దురదృష్టవశాత్తు అతని ఫోన్ జారీ బిలంలో పడిపోతూ ఉండగా ఇంతలో ఆ వ్యక్తి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసి అతడు కూడా ఆ బిలం లోకి జారిపోయాడు. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ రాళ్లను పట్టుకుని ఆగిపోయాడు. అది గమనించిన పర్యాటక గైడ్ లు వెంటనే మౌంటెన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారి రక్షించే పరిస్థితి లేకపోవడంతో వెంటనే రిస్క్యూ టీమ్ ని హెలికాప్టర్ ద్వారా రప్పించి ఆ యువకుడిని రక్షించారు.

అయితే ఆ యువకుడి గాయాలు పాలు అవ్వగా వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం నిషేధిత ప్రాంతంలోకి ఎంటర్ అయిన ఆ కుటుంబం పై కేసు పెట్టి పోలీసులు అరెస్టు చేశారు. కాగా అగ్నిపర్వతం విషయానికి వస్తే..ఇటలీలోని నేపుల్స్ చుట్టూ అత్యంత ప్రధానమైన వెసువియస్ తోపాటు మరో 40 చిన్న అగ్ని పర్వతాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోని యాక్టివ్ అగ్ని పర్వతాల్లో వెసువియస్ ఒకటి. 1,281 మీటర్లు4,202 అడుగుల ఎత్తుతో ఉండే ఈ అగ్ని పర్వతాన్ని చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతుంటారు. అగ్ని పర్వతంపై ప్రధాన బిలంతోపాటు అక్కడక్కడా చిన్న బిలాలు కూడా ఉంటాయి. వాటి నుంచి తరచూ అతి తీవ్రమైన వేడి వాయువులు, విష వాయువులు వెలువడుతుంటాయి.