Reverse Aging With Blood : తండ్రి, కొడుకు, మనవడు..రక్తంతో ముసలితనానికి చెక్

Reverse Aging With Blood : ఎప్పటికీ యువకుడిలా .. యంగ్ గా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. ముసలితనం దరిచేరకూడదని.. ఎవరు మాత్రం అనుకోరు.

  • Written By:
  • Updated On - May 28, 2023 / 08:25 AM IST

Reverse Aging With Blood : ఎప్పటికీ యువకుడిలా .. యంగ్ గా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు.

ముసలితనం దరిచేరకూడదని.. ఎవరు మాత్రం అనుకోరు.

అందుకే ఇప్పుడు రివర్స్ ఏజింగ్(Reverse Aging With Blood)పై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి.

ఈ దిశగా 45 ఏళ్ళ అమెరికా మిలియనీర్ బ్రియాన్ జాన్సన్ అందరి కంటే ఒక అడుగు ముందున్నారు. ఇందుకోసం అతడు “బ్లూ ప్రింట్” పేరుతో సరికొత్త ప్రాజెక్ట్ చేపట్టాడు.

ఓ వైపు ఎలుకలపై .. మరోవైపు తనపై కూడా పరిశోధనలు చేస్తున్నారు.

తాజాగా ఆయన తన 70 ఏళ్ళ తండ్రి రిచర్డ్ పై కూడా రీసెర్చ్ చేశారు.

తన 17 ఏళ్ళ కొడుకు తాల్మేజ్ నుంచి 1 లీటర్ రక్తం సేకరించి.. దాన్ని ప్రాసెస్ చేశాడు. ఆ రక్తాన్ని ద్రవ ప్లాస్మా, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్లు అనే నాలుగు ప్రత్యేక బ్యాచ్‌లుగా విడగొట్టాడు. ఇలా నాలుగు భాగాలుగా విడగొట్టిన 17 ఏళ్ళ తాల్మేజ్ రక్తాన్ని తొలుత జాన్సన్ శరీరంలోకి ఎక్కించారు. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి.. జాన్సన్ శరీరం నుంచి ఇంకో లీటర్ రక్తాన్ని సేకరించి అతని తండ్రి రిచర్డ్ శరీరంలోకి ఎక్కించారు. ఈ ప్రక్రియ కొన్ని నెలల పాటు కొనసాగింది. మధ్యమధ్యలో, జాన్సన్, టాల్మేజ్‌ల వయస్సులో ఉన్న ఇతర ఆరోగ్యవంతుల రక్తం కూడా సేకరించారు. దాన్ని మళ్ళీ ద్రవ ప్లాస్మా, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్లు అనే నాలుగు ప్రత్యేక బ్యాచ్‌లుగా విడగొట్టి.. తొలుత జాన్సన్ కు, ఆ తర్వాత అతని తండ్రి రిచర్డ్ బాడీలోకి ఎక్కించారు. ఈ ప్రయోగంపై 30 మంది వైద్య నిపుణుల టీమ్ పనిచేసింది. ఈ ప్రయోగంలో సానుకూల ఫలితాలే వచ్చాయని వైద్యుల బృందానికి నేతృత్వం వహిస్తున్న వైద్యుడు ఆలివర్ జోల్మాన్ చెప్పారని కొన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి.

ముసలి ఎలుకలు యంగ్ అయ్యాయి..

అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ 2023 జనవరి 12న ఒక రీసెర్చ్ రిపోర్ట్ పబ్లిష్ చేసింది. రక్తంలోని ప్లాస్మాను యాంటీ ఏజింగ్ టెక్నిక్‌గా ఉపయోగించే ప్రక్రియ గురించి అందులో ప్రస్తావించారు. ఇప్పుడు దీని ఆధారంగానే బ్రియాన్ జాన్సన్ ప్రయోగాలు చేస్తున్నాడు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రయోగంలో ముసలి ఎలుకల బాడీలోకి యువ ఎలుకల రక్తాన్ని ఎక్కించారు. ఇది చేసిన కొన్ని వారాల తర్వాత .. ముసలి ఎలుకల కళ్లలో కాంతి తిరిగొచ్చింది. వాటి జీవక్రియ మెరుగైంది. ఎముకలు బలపడ్డాయి. ఇతర శరీర విధులు మెరుగయ్యాయి.

Also read  : Rose Petals : గులాబీ పువ్వు అందానికే కాదు, ఆయుష్షును పెంచుతోంది…ఎలాగో తెలుసుకోండి..?

వైద్య నిపుణులు ఏమంటున్నారు ?

అయితే ఈ రక్త మార్పిడి మానవులలో ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనే దానిపై పూర్తి క్లారిటీ లేదు. రక్త మార్పిడి వల్ల మనుషుల ఆయుష్షు పెరుగుతుందనే వాదనపై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. “ప్రస్తుతానికి రక్త మార్పిడి పద్ధతితో మానవులకు ఎలాంటి ఉపయోగమూ ఉండకపోవచ్చు. దానివల్ల ముసలి వాళ్ళు యూత్ గా మారుతారు అనేందుకు రుజువు కూడా లేదు. ఇలా రక్తం మార్చుకోవటం ఆరోగ్యానికి డేంజర్ కూడా. సాధారణంగా అయితే తీవ్ర గాయాలతో రక్త స్రావం జరిగినప్పుడు, తీవ్రమైన కాలేయ వ్యాధిగ్రస్తులకు, రక్తం గడ్డకట్టే సామర్థ్యం తగ్గిన వాళ్ల శరీరంలోకి మాత్రమే రక్త ప్లాస్మాను ఎక్కిస్తుంటారు” అని అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌ కు చెందిన బయోకెమిస్ట్ చార్లెస్ బ్రెన్నర్ స్పష్టం చేశారు.

రక్తంతో రివర్స్ ఏజింగ్‌పై ఈ కంపెనీలు కూడా..

ప్రపంచంలోని చాలా స్టార్టప్ కంపెనీలు రివర్స్ ఏజింగ్‌పై పనిచేస్తున్నాయి. 2016లో అమెరికాకు చెందిన అంబ్రోసియా అనే స్టార్టప్ యువకుల లీటరు రకాన్ని ముసలి వాళ్ళ శరీరంలోకి ఎక్కించేందుకు రూ.6.5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పింది. ఐవీఎఫ్ ద్వారా 16 నుంచి 25 ఏళ్ల యువకుల నుంచి రక్తాన్ని తీసుకుంటామని, వృద్ధుల శరీరంలోకి ఎక్కిస్తామని ఈ స్టార్టప్ తెలిపింది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ న్యూరాలజిస్ట్ టోనీ వైస్ కోర్ యొక్క స్టార్టప్ ‘అల్కాహెస్ట్’. ఆగస్టు 2019లో ఆరు నెలల పరీక్ష తర్వాత, తాము ఆశించిన ఫలితాలను సాధించామని వెల్లడించింది. తేలికపాటి అల్జీమర్స్ వ్యాధి ఉన్న 40 మంది రోగులలోకి .. యువకుల నుంచి సేకరించిన బ్లడ్ ప్లాస్మాను ఎక్కించగా వారి పరిస్థితి మెరుగైందని తెలిపింది.