Site icon HashtagU Telugu

Modi Thali: యూఎస్ లో మోడీజీ స్పెషల్ థాలీ.. అదిరిపొయే వంటకాలతో!

Modi Thali

Modi Thali

ఇతర దేశాల ప్రధానులతో పోల్చితే మనదేశ ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకత వేరు. కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. త్వరలోనే నరేంద్ర మోదీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో మోడీ కోసం న్యూజెర్సీలోని ఒక రెస్టారెంట్ ప్రత్యేక ‘థాలీ’ని ఇంట్రడ్యూ చేసింది. చెఫ్ శ్రీపాద్ కులకర్ణి తయారు చేసిన  ‘మోడీ జీ థాలీ’లో ఖిచ్డీ, రసగుల్లా, సర్సన్ కా సాగ్, కాశ్మీరీ దమ్ ఆలూ, ఇడ్లీ, ధోక్లా, చాచ్, పాపడ్ వంటి అనేక నోరూరించే వంటలు ఉన్నాయి. స్థానిక భారతీయ ప్రవాసుల ప్రాధాన్యతల ఆధారంగా రుచికరమైన ఆహార పదార్థాలతో మోడీ థాలీని తయారుచేశామని చెఫ్ కులకర్ణి పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ యూఎస్ టూర్‌కు వెళ్లనున్నారు. జూన్‌ 21 నుంచి 24 వరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోదీకి బైడెన్ దంపతులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడంతో పాటు వైట్ హౌస్‌లో విందు ఇవ్వనున్నారు. అమెరికా, భారత్ సంబంధాలను ఈ పర్యటన మరింత బలోపేతం చేస్తుందని భారత విదేశాంగ శాఖతో పాటు వైట్‌హౌస్ పేర్కొంది. మరోవైపు, మోదీకి స్వాగతం పలికేందుకు అక్కడ స్థిరపడ్డ భారతీయులు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు.

US కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించే మొదటి భారత ప్రధానిగా మోడీ నిలువబోతున్నారు. కాగా ప్రధాని మోదీ పేరుతో ఇప్పటికే అనేక రెస్టారెంట్లు స్పెషల్ థాలీని అందుబాటులోకి తెచ్చాయి. గత సంవత్సరం ఢిల్లీకి చెందిన ఒక రెస్టారెంట్, ప్రధాని పుట్టినరోజు సందర్భంగా 56 ఫుడ్ ఐటెమ్స్‌తో కూడిన ‘56 ఇంచ్ నరేంద్ర మోదీ థాలీ’ని తయారు చేసింది. దీన్ని వెజ్, నాన్ వెజ్ ఆప్షన్లలో అందించింది. ప్రస్తుతం యూఎస్ లో తయారుచేసిన మోడీ థాలీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Pawan Kalyan Yagam: ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమం కోసం ‘పవన్’ యాగం!

Exit mobile version