ఈ మధ్యకాలంలో దొంగతనాలు చేసే దొంగలను పట్టుకోవడం చాలా కష్టమవుతోంది. ఎందుకంటే పోలీసు వారు దొంగలను అడ్వాన్సుడ్ గా పట్టుకోవడానికి టెక్నాలజీలను కొత్త కొత్త ఐడియాలను వాడుతూ ఉండగా, దొంగలు మరింత ముందు చూపుతో పోలీసుల చేతికి దొరకకుండా చిక్కకుండా ఉండడం కోసం సరికొత్త ప్రయత్నాలను చేస్తున్నారు. అలాగే ప్రస్తుత కాలంలో అయితే మన చుట్టూనే ఉంటూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు దొంగ ఎవరు దొంగ కాదు అన్నది గుర్తించడం కూడా చాలా కష్టం. అలా గుర్తించే లోపే జరగాల్సిన నష్టం మొత్తం జరిగి పోతుంది.
అలా తాజాగా ఒక వ్యక్తి ఒక గెటప్ లో వచ్చి బ్యాంకు ను మొత్తం కొల్లగొట్టి దోచుకుపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని జార్జియాలో ఒక వ్యక్తి బ్యాంకు వద్దకు సాధారణంగా కాకుండా ఒక వృద్దురాలి వేషంలో వచ్చాడు. ఆ తర్వాత బ్యాంకు సిబ్బంది వద్దకు వెళ్లి తుపాకిని చూపి బెదిరించి డబ్బు దోచుకున్నాడు. ఆ తరువాత బయటకు వచ్చి నెంబర్ ప్లేట్ లేని తెల్లటి ఎస్‌యూవీ కారులో దర్జాగా పారిపోయాడు. అయితే బ్యాంకు దగ్గర చుట్టూ పక్కన వాళ్ళు కూడా ఆ వృద్దురాలి వింత గెటప్‌ని పసిగట్టలేకపోయారు. అయితే తాజాగా ఈ ఘటన అట్లాంటా లోని హెన్నీ కౌంటీలో చోటుచేసుకంది. దోపిడి చేసేటప్పుడూ ఆ వ్యక్తి పూల దుస్తులతో ఆకర్షణీయంగా వచ్చాడు.
ఈ మేరకు వృద్ధురాలి రూపంలో వచ్చిన వ్యక్తి ఫోటోలను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే విషయం గురించి పోలీసులు ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేధిగా తెలిపారు. సదరు నిందితుడి ఆచూకి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సిబ్బంది ఫిర్యాదు చేసేవరకు ఈ విషయం వెలుగు చూడకపోవడం గమనార్ధం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.