Site icon HashtagU Telugu

ISIS Chief : అమెరికా మిస్సైల్ దాడి.. ఐసిస్ చీఫ్ హతం

US missile strike kills ISIS chief

US missile strike kills ISIS chief

ISIS Chief : ఇస్లామిక్ స్టేట్ (ISIS) గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ అబ్దుల్లా మక్కీ ముస్లిహ్ అల్ రిఫాయ్ అలియాస్ అబు ఖదీజాను అగ్రరాజ్యం హతమార్చింది. ఇరాకీ ఇంటెలిజెన్స్, భద్రతా దళాల సహకారంతో అమెరికా సైన్యం ఇరాక్‌లో గల ఓ ప్రాంతంలో అతడిపై క్షిపణి ప్రయోగించి మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను యూఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది.

అబు ఖదీజా కారులో ప్రయాణిస్తున్న సమయంలో అమెరికా దళాలు అతడిపై క్షిపణి ప్రయోగించాయి. ఘటనాస్థలంలోనే అతడు మరణించాడని, అతడితో పాటు మరో ఐసిస్ ఉగ్రవాది కూడా మృతి చెందినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దాడి అనంతరం భద్రతా దళాలు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. వీరిద్దరి శరీరాలకు సూసైడ్ బంబాలు అమర్చి ఉన్నాయని, వీరి వెంట మరి కొన్ని ఆయుధాలు కూడా ఉన్నట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. అంతేకాకుండా గతంలో జరిపిన ఓ ఆపరేషన్‌లో త్రుటిలో తప్పించుకున్న అబు ఖదీజా.. ఇప్పుడు హతమయ్యాడని.. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మరీ అతడిని మృతిని ధ్రువీకరించినట్లు స్పష్టం చేశారు.

కాగా, ప్రపచం వ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదుల్లో ఒక్కడిగా ఉన్న ఈయనపై 2023లో అమెరికా ఆంక్షలు విధించింది. మరోవైపు ఐసిస్‌కు వ్యతిరేకంగా యూఎస్ నేతృత్వంలోని సంకీర్ణ భద్రతా దళం కొన్నేళ్లుగా కీలక మిలిటరీ ఆపరేషన్లు చేపట్టింది. ఇప్పటి వరకు అనేక మందిని మట్టుబెట్టింది. ఇక, అబు ఖదీజా ఐసిస్ ముఠాలో రెండో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా ఉన్నాడు. ఇతడు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థకు చెందిన లాజిస్టిక్స్, ప్లానింగ్, ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ చూసుకునేవాడు.

Read Also: Muslim Contractors : ముస్లిం కాంట్రాక్ట‌ర్ల కోటాకు కర్ణాటక క్యాబినెట్ ఆమోదం