26/11 Mumbai Attacks : 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారి తహవూర్ రాణాకు అమెరికా న్యాయస్థానం షాకిచ్చింది. ఇటీవల తహవూర్ రాణా తనను భారత్‌కు అప్పగించవద్దంటూ యూఎస్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. రాణా అప్పగింతకు ట్రంప్ సర్కార్ ఇటీవల పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. అయితే ఇండియాకు తనను అప్పగిస్తే, ఆ దేశం తనను చిత్రహింస పెడుతుందని తన అభ్యర్థన లేఖలో అమెరికా సుప్రీంకోర్టుకు తెలిపాడు. అప్పగింతపై తక్షణమే స్టే విధించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని రాణా కోరాడు.
Read Also: Ration Rice Transfer Case : పేర్ని నానికి ముందస్తు బెయిల్
భారత్‌లో తనను హింసిస్తారని రాణా పిటిషన్‌లో పేర్కొన్నాడు. పాకిస్తాన్ మూలాలు ఉన్న ముస్లింను కాబట్టి.. ఒకవేళ భారత్‌కు అప్పగిస్తే, తనను ఆ దేశం వేధిస్తుందన్నాడు. ప్రాణాంతక జబ్బులతో పోరాడుతున్న తనను భారత్‌కు అప్పగించడమంటే మరణశిక్ష విధించడమేనని పేర్కొన్నాడు. తన అప్పగింత అమెరికా చట్టాలతో పాటు ఐరాస తీర్పుల ఉల్లంఘనే అని తెలిపాడు. ఉగ్రదాడి కేసులో ఇండియాలో విచారణ చేపడితే, తాను ఎక్కువ కాలం జీవించలేనని రాణా తన అభ్యర్థనలో వెల్లడించాడు. ఒకవేళ స్టే ఇవ్వకుంటే, దీనిపై సమీక్ష ఉండదని, అమెరికా కోర్టులు తమ పరిధిని కోల్పోతాయని, ఇక రాణా సజీవంగా ఉండలేరని సుప్రీంకోర్టు పిటీషన్‌లో తెలిపాడు.
అంతేకాక..గతంలో పాక్ ఆర్మీలో చేశానని, 2208 ముంబై దాడులతో లింకుందని ఆరోపిస్తున్నారని, తన 2023 మానవ హక్కుల నివేదిక ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మైనార్టీలను వ్యవస్థీకృతంగా వివక్షకు గురిచేస్తున్నదని, అక్కడ ప్రభుత్వం చాలా నిరంకుశంగా మారిందని, ఒకవేళ భారత్‌కు అప్పగిస్తే తనకు చిత్రహింస జరుగుతుందని తన అభ్యర్థనలో రాణా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో అప్పగింతపై స్టే విధించాలని తహవూర్ పిటిషన్ పేర్కొన్నాడు. అయినా కూడా అమెరికా కోర్టు స్టే ఇచ్చేందుకు అంగీకరించలేదు. పాక్ సంతతికి చెందిన కెనడా జాతీయుడైన రాణా.. ప్రస్తుతం లాస్‌ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ జైల్లో ఉన్నాడు. పాక్–అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో అతనికి దగ్గరి సంబంధాలున్నాయి. 2008, నవంబర్ 26వ తేదీన ముంబైలో జరిగిన ఉగ్ర పేలుళ్లలో హేడ్లీ ప్రధాన నిందితుడు. రాణాకు పాక్‌లోని లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఉగ్ర సంస్థలతో లింకు ఉన్నది.
Read Also: RTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం