సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. యూపీకి చెందిన ఇషితా కిషోర్ ఆలిండియా టాపర్ గా(IAS Toppers) నిలిచింది. మెయిన్స్ లో అర్హత సాధించిన వారిని పర్సనాలిటీ టెస్టు కోసం ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఇంటర్వ్యూ చేశారు. మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. జనరల్ కోటాలో 345, ఈడబ్ల్యూఎస్ 99, ఓబీసీ 263, ఎస్సీ 154, ఎస్టీ కోటాలో 72 మంది సివిల్ సర్వీసెస్ కు సెలెక్ట్ అయ్యారు. ఈ ఫలితాల్లో మొదటి నాలుగు ర్యాంకులు(IAS Toppers) అమ్మాయిలే సాధించడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు అభ్యర్థులు మెరిశారు. తిరుపతికి చెందిన జి.వి.ఎస్ పవన్ దత్తాకు 22వ ర్యాంకు వచ్చింది. హెచ్ఎస్ భావన 55 వ ర్యాంకు, సాయి ప్రణవ్ 60, నిధి పాయ్ 110, అంకుర్ కుమార్ 257, చల్లా కల్యాణి 285, శ్రీకృష్ణ 293, హర్షిత 315, లక్ష్మి సుజిత 311, సోనియా కటారియా 376, వై .శృతి 362, రేవయ్య 410, సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి 426, రెడ్డి భార్గవ్ 772, నాగుల కృపాకర్ 866 ర్యాంకులు వచ్చాయి.
also read : Keerthi Jalli: తెలుగువారి కీర్తిని పెంచిన ఐఏఎస్ కీర్తి జల్లి.. అసోం వరదల్లో బాధితులకు అండదండలు
ఆలిండియా సివిల్స్ టాపర్స్ వీరే..
- ఇషితా కిషోర్
- గరీమా లోహియా
- ఉమా హారతి ఎన్
- స్మృతి మిశ్రా
- మయూర్ హజారికా
- గహనా నవ్య జేమ్స్
- వసీమ్ అహ్మద్ భట్
- అనిరుద్ధ్ యాదవ్
- కనికా గోయల్
- రాహుల్ శ్రీవాస్తవ