Site icon HashtagU Telugu

ప్రేమ కోసం ఆ మహిళ చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రకృతిని ఎదురించి?

15932951c69ddaf0f823acd362cb8248

15932951c69ddaf0f823acd362cb8248

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రకృతి విరుద్ధమైన బంధాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అయితే ఇది వరకు మన భారత సమాజంలో ఇటువంటి ధోరణలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ కానీ సోషల్ మీడియా ప్రభావం వల్ల ఈ మధ్యకాలంలో మన భారత దేశం లో ఎక్కువ అతున్నాయి. అయితే రాను రాను సమాజంలో పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయో, మనుషుల ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుందో అర్థం కావడం లేదు. అయితే ఇప్పటికే ప్రకృతి విరుద్ధంగా ఎన్నో బంధాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా అలాంటి ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఇద్దరు మహిళల లో ఒక మహిళ మరో మహిళతో బంధానికి వీలుగా లింగమార్పిడి చేయించుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్ రాజ్ కు చెందిన ఇద్దరు మహిళల మధ్య సన్నిహిత సంబంధం ( లెస్బియన్ ) ఏర్పడింది. దీంతో ఆ మహిళ ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ మహిళల కుటుంబాలు వారి బంధానికి అంగీకరించకపోవడంతో వారిద్దరిలో ఒక మహిళ లింగ మార్పిడి చికిత్స చేయించుకొని పురుషుడిగా మారిపోవాలని నిర్ణయించుకుంది.

అప్పుడు ఎవరూ అడ్డు చెప్పరని భావించింది. ఇరువురు కుటుంబాలకు ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో చివరిగా లింగమార్పిడి మార్గాన్ని ఎంపిక చేసుకుంది. ప్రయాగరాజ్ లోని స్వరూపరాణి నెహ్రూ హాస్పిటల్ కు చెందిన ఓ వైద్యుల బృందం లింగ మార్పిడి సర్జరీని పాక్షికంగా నిర్వహించింది. పూర్తిస్థాయి పురుషునిగా మార్చేందుకు మరొక ఏడాదిన్నర సమయం పడుతుందని డాక్టర్ మోహిత్ తెలిపారు. ఆమెకు టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్తామని తెలిపారు. అయినా సంతానానికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

Exit mobile version