Toilet food Video: దారుణం.. టాయిలెట్ లో క్రీడాకారులకు భోజనం, వీడియో వైరల్!

స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని ఓ టాయిలెట్‌లోనే కబడ్డీ ఆటగాళ్లకు ఆహారం వడ్డించారు. ఈ వార్తలు వైరల్ కావడంతో ఉత్తర ప్రదేశ్ లోని

  • Written By:
  • Updated On - September 20, 2022 / 02:51 PM IST

స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని ఓ టాయిలెట్‌లోనే కబడ్డీ ఆటగాళ్లకు ఆహారం వడ్డించారు. ఈ వార్తలు వైరల్ కావడంతో ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్‌పూర్‌లోని జిల్లా క్రీడా అధికారి అనిమేష్ సక్సేనాను సస్పెండ్ చేశారు. అనిమేష్ సక్సేనాను తక్షణమే సస్పెండ్ చేసినట్లు క్రీడల అదనపు ప్రధాన కార్యదర్శి నవనీత్ సెహగల్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా  యూపీ ప్రభుత్వం ఆర్థిక, రెవెన్యూ ఏడీఎం రజనీష్ కుమార్ మిశ్రాను ఆదేశించింది.

స్థలం కొరత కారణంగా టాయిలెట్‌లో ఉంచిన సగం ఉడికిన ఆహారాన్ని అందిస్తున్నారని క్రీడాకారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ ఆఫ్ స్పోర్ట్స్ జిల్లా మేజిస్ట్రేట్‌ను సమాధానం కోరింది. మూడు రోజుల సబ్ జూనియర్ బాలికల కబడ్డీ పోటీలో మొదటి రోజు క్రీడాకారులకు మధ్యాహ్న భోజనంలో సగం ఉడికిన అన్నం వడ్డించారని ఆవేదన వ్యక్తం చేశారు. టాయిలెట్ లోపల, నేలపై కాగితాలపై పడి ఉన్న ‘పూరీలు’ కనిపించాయి. మధ్యాహ్న భోజనంలో కూరగాయలు, సలాడ్‌లు మాత్రమే తినాల్సి వచ్చిందని ఆటగాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు.