కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెన్నైలోని ఓ మార్కెట్లో కూరగాయలు కొంటూ కనిపించారు. ఈ వీడియోను ఆర్ధిక మంత్రి కార్యాలయం ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. ఈ ట్వీట్ ను ఆర్థిక మంత్రి కూడా రీట్వీట్ చేశారు. చేతిలో బుట్ట పట్టుకుని కూరగాయలు కొంటున్నట్లు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. స్థానికులతో ముచ్చటిస్తూ కూరగాయలు కొనుగోలు చేశారు. కేంద్రమంత్రి మార్కెట్ కువచ్చి కూరగాయలు కొనుగోలు చేయడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
During her day-long visit to Chennai, Smt @nsitharaman made a halt at Mylapore market where she interacted with the vendors & local residents and also purchased vegetables. pic.twitter.com/emJlu81BRh
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) October 8, 2022