Site icon HashtagU Telugu

Russia Ukraine War: హ‌లో హీరో.. నువ్వు తోపు సామీ..!

Ukrain Landmine

Ukrain Landmine

ఉక్రెయిన్ పై ర‌ష్యా దండ‌యాత్ర కొన‌సాగుతున్న క్రమంలో, రష్యా సైనిక‌ దళాలు ఉక్రెయిన్‌ సైనికులపై దాడులను కొనసాగిస్తున్న క్ర‌మంలో తాజాగా ఓ ఆస్తక్తికర ఘటన చోటుచేసుకుంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఉక్రెయిన్‌లోని బెర్డయాన్‌స్క్‌ నగరంలో ఉక్రెయిన్‌ యుద్ధ ట్యాంకులను పేల్చేందుకు రష్యా సేనలు నడిరోడ్డుపై ఓ ల్యాండ్‌మైన్‌ను అమర్చారు. అయితే ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ఉక్రెయిన్‌ పౌరుడికి ఆ ల్యాండ్‌మైన్ కంట‌ప‌డింది.

ఈ నేప‌ధ్యంలో ఆ ల్యాండ్‌మైన్ గురించి బాంబ్‌స్క్వాడ్‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా, అస‌లేమాత్రం భ‌య‌ప‌డ‌కుండా రోడుమీద ఉన్న ల్యాండ్‌మైన్‌ను విసిరిపారేశాడు. ఈ క్ర‌మంలో ఆ పౌరుడు ఎలాంటి రక్షణ దుస్తులు, పరికరాలు లేకుండానే, ఎలాంటి భ‌యం కానీ, చేతిలో ల్యాండ్‌మైన్ ఉంద‌నే టెన్ష‌న్ కానీ లేకుండా సిగ‌రెట్ తాగుతూ ఓ హీరోలా ల్యాండ్‌మైన్‌ను ప‌ట్టుకుని న‌డుచుకుంటూ వెళుతూ దూరంగా వెళ్లి విసిరిపారేశాడు. దీంతో ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో వైర‌ల్‌గా మారింది. ఈ క్ర‌మంలో అత‌డి తెగువ‌కి ఫిదా అవుతున్న నెటిజ‌న్లు.. నువ్వు తోపు సామీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.