Site icon HashtagU Telugu

Viral Video : డోంట్‌ వర్రీ, బీ హ్యాపీ.. ఉక్రెయిన్‌ మిలిటరీ బ్యాండ్ సాంగ్ వైర‌ల్..!

Ukraine Military Band

Ukraine Military Band

ఉక్రెయిన్‌పై రష్యా 15 రోజులుగా దండ‌యాత్ర కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ దేశాలు యుద్ధం ఆపాల‌ని విజ్ఞ‌ప్తి చేసినా, ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నారు. దీంతో ఉక్రెయిన్‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల‌పై ర‌ష్యా సైనిక ద‌ళం బాంబులు, క్షిప‌ణులతో విరుచుకుప‌డుతున్న క్ర‌మంలో, ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌తో స‌హా ప్ర‌ధాన న‌గారాలు పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి.

అంతే కాకుండా ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి అక్క‌డి సైనికుల‌తో పాటు, సామాన్య పౌరులు, ముక్యంగా చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ర‌ష్యా సైన్యం చేస్తున్న దాడిలో ఎంతో మంది గాయ‌ప‌డుతున్నారు. ఇక ఉక్రెయిన్ దేశానికి సంబంధించి యుద్ధానికి ముందు, తర్వాత అంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న అనేక ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా ఉక్రెయిన్‌ యుద్ధ భూమి నుంచి వచ్చిన మరో వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. యుద్ధ వాతావ‌ర‌ణంలో చిక్కుకున్న దేశం, ప్ర‌జ‌ల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయ‌కుండా ర‌ష్యాతో పోరాటం చేస్తున్న ఉక్రెయిన్ సైనికులు, ఆ దేశ ప్ర‌జ‌ల్లో ధైర్యం నింపేందుకు, అమెరికాకు చెందిన సింగ‌ర్ బాబీ మెక్‌ఫెరిన్ పాడిన డోండ్ వ‌ర్రీ.. బీ హ్యాపీ పాట‌ను ఉక్రెయిన్ మిల‌ట‌రీ బ్యాండ్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

ఇక ఆ వీడియోలో యూనిఫామ్‌తో ఉన్న ఐదుగురు ఉక్రెయిన్ సోల్జ‌ర్స్ ఒడెస్సా నగరంలోని ఒపెరా, బాలెట్‌ థియేటర్‌లకు రక్షణగా ఉంటూ తమ దగ్గర ఉన్న వాయిద్యాలతో డోండ్ వ‌ర్రీ.. బీ హ్యాపీ పాటను పాడ‌డం ఆ వీడియోలో చూస్తాం. ఈ క్ర‌మంలో వీళ్లు ప్లే చేస్తున్నసమయంలో వెనుక ఉక్రెయిన్‌ జెండాలు క‌నిపిస్తాయి. ఉక్రెయిన్‌ మిలిటరీ బ్యాండ్‌ తన పాట పాడిన వీడియోను బాబీ మెక్‌ఫెరినే తన అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ప‌లు సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్లు చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.