Ukraine Destroyed Russian Boats: తక్కువ అంచనా వేశారు..మా తడాఖా చూపించాం-కీవ్

ఉక్రెయిన్ భూభాగంపైనే కాకుండా నల్ల సముద్రంలోనూ రష్యాకు కీవ్ బలగాలు నుంచి గట్టి పోటీ ఎదురౌతోంది.

  • Written By:
  • Publish Date - May 3, 2022 / 06:16 AM IST

ఉక్రెయిన్ భూభాగంపైనే కాకుండా నల్ల సముద్రంలోనూ రష్యాకు కీవ్ బలగాలు నుంచి గట్టి పోటీ ఎదురౌతోంది. తాజాగా తమ డ్రోన్స్ నల్ల సముద్రంలో రెండు రష్యన్ పెట్రోలింగ్ బోట్స్ ను ధ్వంసం చేసినట్లు కీవ్ ప్రకటించింది. స్నేక్ ఐలాండ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున రెండు రష్యన్ రాప్టర్ బోట్స్ ను నీటముంచినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ సోషల్ మీడియాలో వెల్లడించింది. దీనికి సంబంధించి ఏరియల్ వీడియో ఫుటేజీని రిలీజ్ చేసింది. బేరక్టార్ లు బాగా పనిచేస్తున్నాయని ఉక్రెయిన్ సాయుధ దళాల కమాండ్ ఇన్ చీఫ్ వాలెరీ జాలుజ్ని టర్కీలోతయారైన అటాక్ డ్రోన్లను ప్రస్తావిస్తూ ప్రకటన రిలీజ్ చేశారు.

రష్యా రాప్టర్ పెట్రోలింగ్ బోట్స్ లో ముగ్గురు సిబ్బందితోపాటు 20మంది వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. వాటికి మెషిన్ గన్స్ లు కూడా అమర్చి ఉంటాయి. నిఘా, ల్యాండింగ్ కార్యకలాపాల్లో వీటిని ఉపయోగిస్తారు. కాగా నల్ల సముద్రంలో రష్యా యుద్ధ నౌక మాస్క్ వా సైతం ఉక్రెయిన్ దాడుల్లో ధ్వంసమై నీట మునిగింది. ఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన నౌకాదళ యుద్ధానికి ఇది నేతృత్వం వహించగా…ఇప్పటివరకు వెయ్యికిపైగా రష్యా యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది.