Site icon HashtagU Telugu

Ronan Law : భారత బాలుడి పేరుతో బ్రిటన్‌లో ‘రోనన్ లా’.. ఏమిటిది ? ఎవరీ రోనన్ ?

Ronan Law Uk New Law Indian Origin Boy Ronan Kanda

Ronan Law : ఒక భారత సంతతి బాలుడి పేరుతో బ్రిటన్ సర్కారు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అదే.. రోనన్‌ చట్టం. ఇంతకీ ఎవరీ రోనన్ ? అతడి పేరుతో ఎందుకు చట్టాన్ని తెచ్చారు ? ఈ కథనంలో తెలుసుకుందాం..

ఎవరీ రోనన్ ? 

రోనన్‌ కంద(Ronan Law).. భారత సంతతికి చెందిన 16 ఏళ్ల బాలుడు. బ్రిటన్‌లోని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ఏరియాలో అతడి కుటుంబం నివసించేది. 2022 సంవత్సరం జూన్ 29న రాత్రి 8.30 గంటలకు వెస్ట్‌ మిడ్‌ల్యాండ్స్‌ పరిధిలోని వోల్వర్‌హంప్టన్‌ ఏరియా మౌంట్ రోడ్డులో దారుణం జరిగింది. రోనన్ కందాను అతడి స్నేహితులు ప్రబ్‌జీత్ వీథేసా, సుఖ్మన్ షెర్గిల్‌లు మాస్క్ ధరించి వచ్చి, తల్వార్‌లతో దారుణంగా పొడిచి మర్డర్ చేశారు. ప్రబ్‌జీత్,  సుఖ్మన్ వయసు కూడా 16 ఏళ్లే. ఈ ముగ్గురు వోల్వర్‌హంప్టన్‌‌లోని ఖల్సా అకాడమీలో కలిసి చదువుకునేవారు. దీతో అక్కడికక్కడే రోనన్‌ కంద చనిపోయాడు. ఈ మర్డర్ చేయడం కోసం తల్వార్లకు ప్రబ్‌జీత్ వీథేసా ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చాడు. అవి 2022 జూన్ 29న ఉదయాన్నే స్థానిక పోస్టాఫీసుకు చేరుకున్నాయి. ప్రబ్‌జీత్ వీథేసా స్వయంగా పోస్టాఫీసుకు వెళ్లి వాటిని తీసుకొచ్చాడు.

Also Read :Bounty For Mosquitoes: దోమలు కొంటున్నారు.. 5 దోమలకు రూపాయిన్నర

ఎందుకీ మర్డర్ ?

రోనన్‌కు చెందిన ఒక స్నేహితుడు ప్రబ్‌జీత్ వీథేసా, సుఖ్మన్ షెర్గిల్‌ల నుంచి అప్పు తీసుకున్నాడు. అయితే ఆ అప్పును తిరిగి చెల్లించకుండా సతాయిస్తున్నాడు. దీంతో రోనన్ స్నేహితుడిని మర్డర్ చేయాలని  ప్రబ్‌జీత్ వీథేసా, సుఖ్మన్ షెర్గిల్‌ నిర్ణయించుకున్నారు. మౌంట్ రోడ్డు మీదుగా రోనన్ స్నేహితుడు నడుచుకుంటూ వెళ్లే క్రమంలో ఈ మర్డర్ చేయాలని డిసైడయ్యారు. ఆ రోడ్డు పక్కనే ఒక కారులో తల్వార్లు పెట్టుకొని కాపు కాశారు. చివరకు ఆ రోడ్డు మీదుగా ఒక యువకుడు నడుచుకుంటూ వచ్చాడు. అతడిని రోనన్ స్నేహితుడిగా  భావించి తల్వార్లతో పొడిచారు. చివరకు అది రోననే అని చూసి షాక్‌కు గురై, వాళ్లు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసులో ప్రబ్‌జీత్ వీథేసాకు 18 ఏళ్ల జైలుశిక్ష,  సుఖ్మన్ షెర్గిల్‌‌కు 16 ఏళ్ల జైలుశిక్ష విధించారు.

Also Read :Miss World Pageant: తెలంగాణలో మిస్‌ వరల్డ్‌ పోటీలు.. ఎప్పుడంటే?

ఏమిటీ రోనన్ చట్టం ?