95 Years Graduate : 95 ఏళ్ల ఏజ్‌లో పీజీ చేశాడు.. నెక్ట్స్ టార్గెట్ పీహెచ్‌డీ

95 Years Graduate : మనసుంటే మార్గం ఉంటుంది. మనం పెట్టుకునే లక్ష్యాన్ని ఛేదించడంలో, మన మనసులోని కోరికలను నెరవేర్చుకోవడంలో ఏది కూడా అడ్డుగోడగా నిలువలేదు.

  • Written By:
  • Updated On - February 7, 2024 / 01:19 PM IST

95 Years Graduate : మనసుంటే మార్గం ఉంటుంది. మనం పెట్టుకునే లక్ష్యాన్ని ఛేదించడంలో, మన మనసులోని కోరికలను నెరవేర్చుకోవడంలో ఏది కూడా అడ్డుగోడగా నిలువలేదు.  ఈవిషయాన్ని నిరూపించి చూపించారు డాక్టర్ డేవిడ్ మార్జోట్. బ్రిటన్‌‌లోని సర్రే ప్రాంతానికి చెందిన ఈ పెద్దాయన 95 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకొని అందరితో వావ్ అనిపించారు. కింగ్‌స్టన్ విశ్వవిద్యాలయం నుంచి  యూరోపియన్ ఫిలాసఫీలో ఎం‌ఏ కోర్సును డేవిడ్ పూర్తి చేశారు. ఈయన ప్రొఫెషన్ రీత్యా ఒక డాక్టర్. సైకియాట్రిస్ట్ వైద్య కోర్సును పూర్తి చేసిన   72 సంవత్సరాల తర్వాత ఆయనకు మరోసారి చదువుపై ఆసక్తి కలిగింది. దీంతో యూరోపియన్ ఫిలాసఫీలో ఎం‌ఏ కోర్సును కంప్లీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

గత కొన్ని దశాబ్దాల్లో బ్రిటన్‌లో మనోరోగచికిత్స పరిశ్రమలో వచ్చిన మార్పులు, తత్వశాస్త్రం గురించి మరింత అర్థం చేసుకోవడానికిగానూ యూరోపియన్ ఫిలాసఫీలో ఎంఏ కోర్సును డేవిడ్ చేశారు. నేటికాలానికి అనుగుణంగా యూరోపియన్ ఫిలాసఫీని సైకియాట్రిస్టులు ఎలా వాడుకోవచ్చనే దానిపై లోతుగా విషయాలను తెలుసుకునేందుకు ఈ కోర్సును చేశానని ఆయన తెలిపారు.   ఈ కోర్సును చేసే క్రమంలో కింగ్‌స్టన్ యూనివర్సిటీలోని సిబ్బంది, విద్యార్థులు తనకు ఎంతో సహకరించారని చెప్పారు. త్వరలోనే యూరోపియన్ ఫిలాసఫీకి సంబంధించిన పార్ట్ టైమ్ పీహెచ్‌డీ కోర్సులో చేరాలని భావిస్తున్నట్లు 95 ఏళ్ల డేవిడ్ (95 Years Graduate) వెల్లడించారు. పార్ట్ టైమ్ పీహెచ్‌డీ ఏడేళ్లపాటు ఉంటుంది. ఈ లెక్కన ఒకవేళ ఆయన పీహెచ్‌డీ కోర్సులో జాయిన్ అయితే.. అది పూర్తయ్యే సరికి వయసు 102 ఏళ్లకు చేరుకుంటుంది. ఇక యూనివర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవ వేడుకలో డేవిడ్‌తో పాటు ఆయన కుమారుడు, అల్లుడు కూడా పాల్గొన్నారు. కింగ్‌స్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హెలెన్ లావిల్లే ఎంఏ డిగ్రీని డేవిడ్‌కు ప్రదానం చేశారు. అంతకుముందు 2021 సంవత్సరంలో 96 ఏళ్ల ఆర్చీ వైట్ బ్రైటన్ విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసి కీలకమైన రికార్డును నెలకొల్పారు.

Also Read :Free Bus Journey : ఈ బస్సుల్లో పురుషులకూ ప్రయాణం ఉచితం

లేటు వయసులో గర్ల్‌ఫ్రెండ్‌తో బిడ్డకు తండ్రి

హాలీవుడ్ నటుడు  రాబర్ట్ డి నీరో  లేటు   వయసులో  తండ్రి కావడంపై స్పందించారు.  రెండుసార్లు ఆస్కార్  అవార్డులను సొంతం చేసుకున్న  నీరో ,  గర్ల్ ఫ్రెండ్ టిఫనీ చెన్‌తో  కలిపి గత ఏడాది ఏప్రిల్‌లో 79 ఏళ్ళ వయసులో  ఏడో బిడ్డగా ఒక పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.  ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  తండ్రిగా తాను పొందుతున్న ఆనందాలను, అనుభూతి గురించి మాట్లాడారు. తన పాప గియా  చూసినపుడు  చాగా తనకు సంతోషంగా ఉంటుదని,  ఈ వయసులో సాధ్యమైనంత  ఎక్కువ సమయం  పాపతో గడపాలని  కోరుకుంటున్నా అంటూ  భావోద్వేగానికి లోనయ్యాడు..  ఎన్ని టెన్షన్స్ ఉన్నా పాపను ఒక్కసారి చూస్తే అన్నీ మటు మాయం… తన పాప చాలా అందంగా ముద్దుగా  ఉంటుందని చెప్పుకొచ్చాడు.  80 ఏళ్ళ వయసులో తండ్రి అవ్వడం పెద్ద విశేషమే అంటూ మురిసిపోయాడు. ఇప్పటికే ‘గాడ్ ఫాదర్-2’ సినిమాకు రాబర్ట్ డి నీరో  బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. అలాగే   2024 ఆస్కార్ నామినేషన్ లిస్టులో కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ క్యాటగిరీలో  మరో అవార్డు అందుకున్నాడు.  రాబర్ట్ డి నీరో రెండుసార్లు వివాహం చేసుకున్నారు. అతని మొదటి భార్య డయానే అబాట్ ద్వారా ఇద్దరు పిల్లలు, కుమార్తె డ్రేనా , కుమారుడు రాఫెల్ ఉన్నారు. అలాగే  మోడల్-నటి టౌకీ స్మిత్‌తో  జూలియన్ ,ఆరోన్ అనే కవలలకు జన్మనిచ్చాడు.  దీంతో పాటు  రాబర్ట్ డి నీరోకు అతని మాజీ భార్య గ్రేస్ హైటవర్‌తో  కుమారుడు ఇలియట్ ,కుమార్తె హెలెన్ గ్రేస్ ఉన్నారు.వీరిలో ఇద్దరు హాలీవుడ్ లో పలు రంగాల్లో రాణిస్తున్నారు.   ఇక ఏడో సంతానంగా టిఫనీ చెన్‌ ,  నీరోకు పాప గియా పుట్టింది.