Aadhaar: ఇకపై పుట్టిన చిన్నారికి వెంటనే తాత్కాలిక ఆధార్ కార్డు..!

ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలిసిందే.

  • Written By:
  • Updated On - June 15, 2022 / 02:37 PM IST

ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలిసిందే. ఈ ఆధార్ కార్డు ను ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి మరణం వరకు అన్నింటికీ అనుసంధానించే ప్రణాళికలతో కూడి ఉంటుంది. ఇక పుట్టిన వెంటనే శిశువును పేర్లతో ఆటోమేటిక్గా తాత్కాలిక ఆధార్ జారీ అవుతుంది. ఆ తరువాత వారు పెద్దగా అయి మేజర్లు అయిన తర్వాత వేలిముద్రలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

అలాగే ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులు దుర్వినియోగం కాకుండా ఉండటం కోసం త్వరలో రెండు పైలట్ కార్యక్రమాలను ఆరంభించనున్నట్లు యుఐడిఎఐ కు చెందిన కొన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 2010లో ఆధార్ ఆవిష్కరించిన నాటి నుంచి దేశవ్యాప్తంగా పెద్దలందరికీ ఆధార్ జారీ అయ్యింది. ఇకపోతే ఇకపై జన్మించిన దగ్గరనుంచి చనిపోయేవరకు వ్యక్తులకు సంబంధించిన అన్ని ముఖ్యమైన వాటికి ఆధార్ ను తప్పనిసరి చేసే ఆలోచనలో యుఐడిఎఐ ఉంది. మరణ రికార్డులతో కూడా ఆధార్ డేటాను అనుసంధానించడం వల్ల ప్రభుత్వ ప్రయోజనాలు పొందే విషయంలో దుర్వినియోగాన్ని అరికట్టాలని అన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.

అయితే పిల్లలకు కనీసం అయిదేళ్ళు ఉంటేనే వేలిముద్రలు తీసుకుంటారు. ఐదేళ్లు నిండిన పిల్లలకు ఆయా బృందాలు వెళ్లి ఆ పిల్లల వేలిముద్రలు తీసుకుని శాశ్వత ఆధార్ నెంబర్ లు జారీ చేస్తాయట. మళ్లీ 18 ఏళ్ళు నిండిన తరువాత బయోమెట్రిక్ మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి అని అధికారులు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ ను సంప్రదించి మరణించిన వారి వివరాలను వెంటనే ఆధార్ డేటాబేస్ లోకి చేరే విధంగా యుఐడిఎఐ చర్యలు తీసుకోనుంది. మరణించిన వారి ఆధార్ యాక్టివ్ గా ఉండడంతో పాటుగా వారి పేరున వస్తున్న పెంచును ఇంకా ఉపసంహరించుకుండా  ఆటోమెటిక్ గా జమ అవుతుంది అని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఒక వ్యక్తికి ఒక ఆధార్ మాత్రమే ఉండే విధంగా యుఐడిఎఐ చర్యలు తీసుకోనుంది.