Uber Flex : ‘ఉబెర్‌ ఫ్లెక్స్‌’.. మీ రైడ్ ధరను మీరే డిసైడ్ చేసుకోవచ్చు

Uber Flex : ఉబెర్, ఓలా లాంటి ఏదైనా క్యాబ్‌‌ను బుక్‌ చేసే టైంలో ప్రయాణ దూరం ఆధారంగా ఛార్జీలు డిసైడ్ కావడాన్ని గమనిస్తుంటాం.

  • Written By:
  • Updated On - January 7, 2024 / 07:28 AM IST

Uber Flex : ఉబెర్, ఓలా లాంటి ఏదైనా క్యాబ్‌‌ను బుక్‌ చేసే టైంలో ప్రయాణ దూరం ఆధారంగా ఛార్జీలు డిసైడ్ కావడాన్ని గమనిస్తుంటాం. ఒక్కోసారి తక్కువ దూరానికి కూడా ఎక్కువ ధరను చూపిస్తుంది. అలాంటి టైంలో ఛార్జిని తగ్గించేందుకు బేరమాడే సదుపాయం ఉంటే బాగుండు అనిపిస్తుంది కదూ!! ఇప్పటిదాకా లేని ఇలాంటి సౌకర్యాన్ని ఇప్పుడు అందుబాటులోకి తెచ్చేందుకు ఉబెర్ సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ఫీచర్‌‌కు ‘ఉబెర్‌ ఫ్లెక్స్‌’ అని  పేరు పెట్టనున్నారు. దీని ద్వారా ఉబెర్ యూజర్‌ తన రైడ్ కోసం ఎంత ధరైతే పెట్టాలని అనుకుంటున్నాడో అంత ధరకే  క్యాబ్‌‌ను బుక్‌ చేసుకోవచ్చు. ‘ఉబెర్‌ ఫ్లెక్స్‌’  ఫీచర్ వచ్చాక.. మనం రైడ్‌ను బుక్‌ చేసుకున్నప్పుడు సాధారణంగా కనిపించే ధరలకు బదులుగా 9 వివిధ ధరల ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ఒకటి డీఫాల్ట్‌గా ఉంటుంది. రైడ్‌ బుక్‌ చేసుకునే వ్యక్తి ఈ తొమ్మిది ప్రయాణ ధరల్లో  ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ప్రయాణికుడు ప్రతిపాదించిన ధర డ్రైవర్‌కు నచ్చితే దాన్ని అంగీకరిస్తాడు. లేదంటే రెజెక్ట్ చేస్తాడు. ప్రయాణికుడు నచ్చిన ధరను ఎంపిక చేసినా.. తుది నిర్ణయం డ్రైవరుపైనే ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద ఈ ఫీచర్ వల్ల ధర నిర్ణయంపై ఉబెర్ డ్రైవర్లకు, ప్రయాణికులకు ఇద్దరికీ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ(Uber Flex) వచ్చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

వాస్తవానికి గత సంవత్సరం అక్టోబరులోనే ‘ఫ్లెక్స్‌ ఫీచర్‌’ ఫీచర్‌ టెస్టింగ్‌ను ఉబెర్‌ ప్రారంభించింది. ఔరంగాబాద్‌, ఆజ్మీర్‌, బరేలీ, చండీగఢ్‌, కోయంబత్తూర్‌, దేహ్రాదూన్‌, గ్వాలియర్‌, ఇందౌర్‌, జోధ్‌పుర్‌, సూరత్‌ ప్రాంతాలలో దీన్ని టెస్ట్ చేసింది. త్వరలో దిల్లీ, ముంబయి వంటి ప్రధాన నగరాల్లో ఈ ఫీచర్‌ను టెస్ట్ చేయనుంది. భారత్‌తో పాటు లెబనాన్‌, కెన్యా, లాటిన్‌ అమెరికా వంటి దేశాల్లో ఉబెర్ ఈ ఫీచర్‌‌ను త్వరలోనే తీసుకురానుంది.

Also Read: Chinthachiguru Prawns Curry: సండే స్పెషల్.. చింతచిగురుతో రొయ్యల కర్రీ.. ఇలా ట్రై చేయండి..

ఉబెర్ కంపెనీ 2023 సంవత్సరం పనితీరుకు సంబంధించిన నివేదికను డిసెంబర్ 27న విడుదల చేసింది. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR), బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, పూణేల్లో అత్యధిక రైడ్స్  నమోదు చేసినట్లు వెల్లడించింది. నైట్ టైంలో బుక్ చేసిన రైడ్ ల విషయానికొస్తే.. ముంబై దేశ రాజధాని ఢిల్లీని మించిపోయింది. వారాంతపు ప్రయాణంలో మాత్రం కోల్‌కతా ముందుంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని వ్యక్తులు ఎక్కువగా ఉబెర్‌ని ఉపయోగించుకున్నారని, మిగతా నగరాల కంటే అత్యధికంగా ప్రయాణాలు చేశారని, వారు ఆఫీసు వేళల్లో అత్యధిక ట్రిప్‌లను బుక్ చేశారని చెప్పారు. ఈ సంవత్సరంలో ఉబెర్ రైడ్స్ రికార్డు స్థాయిలో 6.8 బిలియన్ కిలోమీటర్లను కవర్ చేశాయి. ఇది భారతదేశంలోని మొత్తం 6.37 మిలియన్ కిలోమీటర్ల రోడ్ నెట్‌వర్క్‌ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ అని కంపెనీ పేర్కొంది.