Site icon HashtagU Telugu

Dallas Air Show : గాల్లో ఢీకొన్న యుద్ధ విమానాలు.. డ‌ల్లాస్ ఎయిర్ షోలో ఘ‌ట‌న‌

Dallas Air Show Imresizer

Dallas Air Show Imresizer

అమెరికాలోని డల్లాస్‌లో జరుగుతున్న ఎయిర్‌ షోలో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రెండు విమానాలు ఢీకొన్నాయని ఏవియేషన్‌ అధికారులు ధృవీకరించారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంఘటన జరిగినప్పుడు డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్‌లో ‘వింగ్స్ ఓవర్ డల్లాస్ ఎయిర్ షో’ సందర్భంగా బోయింగ్ B-17 ఫ్లయింగ్ ఫోర్ట్రెస్ట్, బెల్ P-63 కింగ్‌కోబ్రా ప్రదర్శన చేస్తున్నాయి.సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వీడియోలు చిన్న విమానం దిగువ-ఎగిరే B-17పైకి దిగి చివరికి దానిలోకి దూసుకెళ్లిన దృశ్యాలు క‌నిపిస్తున్నాయి. రెండు విమానాలు డీకొట్టుకోవ‌డంతో ముక్కలుగా విరిగి నేలపై పడిపోయాయి. ఇదిలా ఉండగా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్‌తో కలిసి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎఎ) తెలిపింది. అయితే కూలిపోయే సమయంలో విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనేది ధృవీకరించలేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీకి వ్యతిరేకంగా జరిగిన వైమానిక యుద్ధంలో విజయం సాధించడంలో B-17, నాలుగు ఇంజిన్ల బాంబర్ ప్రధాన పాత్ర పోషించింది.

https://twitter.com/DaleStarkA10/status/1591530928077430784?s=20&t=z3hzDlj161qcR9O_7IDpEg

Exit mobile version