Site icon HashtagU Telugu

Twitter war: వర్మ, పేర్ని నాని ‘ట్విట్టర్’ వార్!

Varma And Perni

Varma And Perni

సినిమా టికెట్ల ధరల విషయమై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వంపై విరుచుపడిన విషయం తెలిసిందే. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానిని లక్ష్యంగా చేసుకుని వరుస ట్వీట్లను సంధిస్తున్నారు. పేర్ని నానిని ట్యాగ్ చేస్తూ ఏకంగా డజను ట్వీట్లు సంధించారాయన. కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. రేషన్ షాపుల ద్వారా బియ్యం, చక్కెర, పప్పు, నూనె.. వంటి నిత్యావసర సరుకులను పేదల ప్రజలకు తక్కువ రేటుకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టే.. సినిమా టికెట్ల రేట్లను కూడా విక్రయించుకోవాలని రామ్‌గోపాల్ వర్మ సూచించారు. దీనికోసం రేషన్ షాపుల తరహాలో.. రేషన్ థియేటర్లు పెట్టాలని సూచించారు. పేదలకు సినిమా అనేది అత్యవసరంగా ప్రభుత్వం భావించినప్పుడు  విద్య, వైద్యం తరహాలోనే వాటి టికెట్ల రేట్లపై సబ్సిడీ ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు.

తాజాగా ఆర్జీవీ ‘‘నేనడిగే ముఖ్య ప్రశ్న టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరని? పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వం లో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా? అంటూ మరో ట్వీట్ చేశారు. దీనికి బదులుగా పేర్ని నాని రియాక్ట్ అయ్యారు. ‘‘హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు @RGVగారూ..’’ సమాధానం ఇచ్చారు.

Exit mobile version